ఎంపీ కూతురిపై హత్య కేసు..
posted on Jul 30, 2016 @ 11:08AM
ఓ హత్య కేసులో ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తె సుజలపై కేసు నమోదైంది. వివవరాల ప్రకారం.. కర్నూలు జిల్లా నంద్యాలలోని నంది గ్రూప్ కంపెనీస్ అనుబంధ సంస్థ నంది అకాడమీ ఇంటర్నేషనల్ స్కూల్ లో పీఆర్ఓ మేడం సుమంత్ హత్యకు గరైన సంగతి తెలిసిందే. ఈకేసులో భాగంగా సుజలతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదైంది.
కాగా పీఆర్ఓగా ఉన్న సుమంత్ కేటాయించిన లక్ష్యం మేరకు అడ్మిషన్లు చేయలేకపోవడం, ఆర్థిక లావాదేవీల్లో తేడాలు రావడంతో పాఠశాల యాజమాన్యం తీవ్రంగా పరిగణించి గురువారం పాఠశాలలోనే నిర్భందించింది. ఈ నేపథ్యంలో తన తమ్ముడు సునీల్ వచ్చి సర్ధి చెప్పడానికి వచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఆ మరసటి ఉదయం మురళీ, షఫీ అనే వ్యక్తులు సునీల్ కు ఫోన్ చేసి సుమంత్ ఆరోగ్యం బాలేదని హాస్పిటల్ చేర్పించామని చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు వచ్చి చూసేసరికి సుమంత్ శవమై కనిపించాడు. అయితే సుమంత్ ఒంటి మీద గాయాలు ఉండటం గమనించిన కుటుంబసభ్యులు అతనిని కొట్టి చంపారని పోలీసులకి ఫిర్యాదు చేశారు.a