ట్రంప్ ను పొగిడితే ఇలాంటి ఎక్స్ ప్రెషన్స్ వస్తాయా..
posted on Jul 30, 2016 @ 10:22AM
అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ అని మనకి తెలిసిందే. దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ఎన్నికల బరిలో అభ్యర్దిగా నిలిచారు అనడంలో అతిశయోక్తిలేదేమో. మరోవైపు ఇలాంటి విద్వేషపూరిత.. విచ్ఛిన్నకరమైన వ్యాఖ్యలు చేసే ట్రంప్ పై విమర్సలు చేసే వాళ్లు కూడా కోకొల్లలు ఉన్నారు. ఆయన కనుక అమెరికా అధ్యక్షుడు అయితే అమెరికా సర్వ నాశనం అవుతుందని అనుకునేవాళ్లు కూడా ఉన్నారు. అలాంటి ట్రంప్ ను పొగిడేవాళ్లు చాలా తక్కువ మందే ఉన్నారు. కానీ ఓ టీవీ యాంకర్ మాత్రం ట్రంప్ ను తెగ పొగిడేసింది. అయితే ఈ యాంకర్ మాటలు విన్న ఇంకో యాంకర్ ఆమె మాటలు విని కళ్లుతేలేసింది. ఆమె ఇచ్చిన ఎక్క్ ప్రెషన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
అసలు సంగతేంటంటే.. ఫిలడెల్ఫియాలో డెమొక్రటిక్ జాతీయ సదస్సు సందర్భంగా ఓ ఛానల్ చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొన్న కేలీ మెక్‌ఎనానీ అనే కన్జర్వేటివ్ కామెంటర్ ట్రంప్ పై ప్రశంసలు కురిపించింది. ట్రంప్‌లో కూడా ఓ గొప్ప ఉదారవాది ఉన్నాడని.. ఆయనకు విశాల హృదయం ఉందని..ట్రంప్ ఎన్నో గొప్పపనులు చేశాడని, తన ప్రైవేటు టైమ్‌లో సమాజానికి సేవలు అందించాడని చెప్పుకొచ్చింది. ఇది విన్న సీఎన్‌ఎన్ విశ్లేషకురాలు ఏంజెలా రైయి ట్రంప్ పై ఆమె చేసే పొగడ్తలకు విస్తుపోయింది. ఏదో వినకూడని పదాలు ఆమె వింటున్నట్టు కనుగుడ్లు తిప్పుతూ విస్తుపోయింది. దీంతో ఆమె ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో అందరూ ఒకటే కామెంట్లు చేస్తున్నారు. ట్రంప్ గారి గొప్పతనం విని ఇంకెంత మంది ఇలా అయిపోతారో అని సెటైర్లు విసురుకుంటున్నారు. మరి కొన్నిసార్లు ఇలాంటి మాటలు వింటే ఆశ్చర్యపడక తప్పదు మరి.