మొదలయిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
posted on Apr 6, 2014 8:17AM
రాష్ట్రంలోని 543 మండలాల్లో 557 జెడ్పీటీసీ, 8250 ఎంపీటీసీలకు ఈరోజు (ఆదివారం) తోలి దశ మొదలయ్యాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మళ్ళీ ఈనెల 11న రెండవ దశ ఎన్నికలు జరుగుతాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్ధులకు ఎన్నుకొనేందుకుగాను ఒక్కో ఓటరుకు రెండు ఓట్లు ఉంటాయి. ఓటర్లు ఒకేసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్ధులకు ఓటేయవలసి ఉంటుంది గనుక, వారిలో ఎటువంటి అయోమయానికి తావు లేకుండా ఎంపీటీసీకి పింక్ కలర్ బ్యాలట్ పేపర్, జెడ్పీటీసీకి తెల్ల రంగు బ్యాలట్ పేపర్ ఉపయోగిస్తున్నట్లు ఎన్నికల కమీషనర్ రమాకాంత్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్నందున ఈ ఎన్నికల ఫలితాల ప్రకటన కూడా వాయిదా వేసేందుకు సుప్రీం కోర్టు ఆమోదం తెలిపినట్లు సమాచారం.