Read more!

మోడీ.. ముసలోడేగానీ, మహానుభావుడే!

మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాతయ్య వయసు 75 ఏళ్ళకు దగ్గర్లో వుంది. కానీ, మన మోడీ తాతయ్య ముసలోడేగానీ, మహానుభావుడే! ఏ దేశానికి వెళ్ళినా అక్కడ జనాన్ని ఇట్టే ఆకర్షించేస్తూ వుంటారు. ముఖ్యంగా పలు దేశాధ్యక్షుడైన మహిళలు మోడీతో సెల్ఫీ దిగడానికి ఇష్టపడుతూ వుంటారు. గత సంవత్సరం డిసెంబర్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.లోని దుబాయ్ వేదికగా జరిగిన ‘కాప్ 28’ సదస్సులో మన పెద్దాయనతో ఇటలీ లేడీ ప్రధాని జార్జియా మెలోనీ సెల్ఫీ దిగారు. అలా సెల్ఫీ దిగుతున్న ఫొటో ‘మెలోడీ’ (#Melodi) పేరుతో ఇంటర్నెట్లో బాగా వైరల్ అయింది. Meloni, Modi ఈ రెండు పదాలనీ మిక్స్ చేసేసి నెటిజన్లు #Melodi అనే కొత్త పదాన్ని క్రియేట్ చేసి సదరు ఫొటోని వైరల్ చేసేశారు. ఇప్పుడు మరోసారి ఈ #melodi కాంబినేషన్ తీసుకున్న సెల్ఫీ మరోసారి వైరల్ అవుతోంది. జార్జియా మెలోనీ సెల్ఫీ తీస్తుంటే, మన మోడీ తాతయ్య కుర్రకారుకు ఎంతమాత్రం తీసిపోకుండా అదిరిపోయేలా నవ్వుతూ సెల్ఫీ దిగారు. ఈ సందర్భం ఇటలీలోని అపులియా వేదికగా జరిగిన జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు సందర్భంగా కుదిరింది. ఈ సమావేశంలో పాల్గొన్న మోడీకి ఇటలీ ప్రధాని మెలోని ‘నమస్తే’ అంటూ సాదర స్వాగతం పలికారు. కొద్దిసేపు వీరిద్దరూ ముచ్చటించుకున్న తర్వాత మరోసారి సెల్ఫీ దిగారు. ఇక చెప్పేదేముంది.. మొదటిసారి దిగిన సెల్ఫీ వైరల్ అయినట్టుగానే, ఈ సెల్ఫీ కూడా వైరల్ అవుతోంది. ఈ సెల్ఫీ కింద సోషల్ మీడియాలో ‘ముసలోడేగానీ, మహానుభావుడే’ లాంటి అర్థం వచ్చే కామెంట్లు నెటిజన్లు పెడుతున్నారు.