Read more!

మంత్రులకు కంఠంనేని కంగ్రాట్స్!

ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి  సత్యకుమార్ యాదవ్‌లను ‘తెలుగువన్’ అధినేత కంఠంనేని రవిశంకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఇద్దరు మంత్రివర్యులకు పుష్ఫగుచ్ఛం అందించి, కంఠంనేని రవిశంకర్ అభినందనలు తెలియజేశారు. రాష్ట్ర మంత్రులుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తమవంతు తోడ్పాటు అందించాలన్న ఆకాంక్షను ఈ సందర్భంగా కంఠంనేని రవిశంకర్ వ్యక్తం చేశారు.