రోజాతో మెగాఫ్యాన్స్ చెడుగుడు!
posted on Jan 10, 2023 @ 9:54AM
రోజా పవన్ కళ్యాణ్ ను విమర్శించే క్రమంలో మెగాస్టార్ చిరంజీవిని ముగ్గులోకి లాగారు. చిరంజీవి, ఆయన తమ్ముళ్ల వల్ల ప్రజలకు ఉపయోగమేమీ లేదు అంటూ విమర్శించారు. మంత్రి పదవి రాగానే రోజా హడావుడిగా తన కుటుంబ సభ్యులందరినీ వెంటేసుకొని మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని వారింటే భోజనం చేసి వస్తూ వస్తూ చిరంజీవితో నవ్వుతూ ఫోటోలు కూడా దిగారు. విమర్శలు అనేవి రాజకీయానికి పరిమితం కావాలి కానీ, రాజకీయాలకు సంబంధం లేకుండా ఉన్న చిరంజీవిపై విమర్శలు గుప్పించడానికి రోజా ఎవరు? చిరంజీవి వల్ల ప్రజలకు ఉపయోగముందో లేదో ప్రజలకు తెలుసు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ చిరంజీవి ఐ బ్యాంక్ లతోపాటు కరోనా సమయంలో రాష్ట్రం వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన ఘనత చిరంజీవిది. ఆమె అనుకున్నట్లు ఐ బ్యాంకు బ్లడ్ బ్యాంకులను రన్ చేయడం అంత సులభం కాదు. రోజుకి ఖర్చు లక్షల్లో ఉంటుంది. వాటిని భద్రపరచాలన్నా, చెడిపోకుండా వాటిని ఉపయోగంలో ఉంచాలన్నా భారీ వ్యయం అవుతుంది.
అంతేనా సినీ కార్మికుల కోసం కూడా చిరు కరోనా సమయం నాటి నుండి తన స్థాయికి తగ్గట్టుగా సాయం చేస్తూనే ఉన్నారు. రాబోయే కాలంలో అసలు తన జీవితం మొత్తం జనాలకి అంకితం చేస్తానని తనకు పదవులు వద్దు అని దేవుడు తనకిచ్చింది చాలని చిరంజీవి చెప్పిన విషయాన్ని ఫ్యాన్స్ రోజాకు గుర్తు చేస్తున్నారు. దేవుడు నాకు అనుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చారు. ఇంతకాలం నా కుటుంబం గురించి ఆలోచించాను. ఇకపై మాత్రం నా సినిమా సంపాదన నుంచి ప్రతి ఒక్కటి సమాజానికే ఇచ్చేస్తాను అని ఓపెన్ గా చెప్పారు. చిరంజీవి వల్ల ప్రజలకు ఉపయోగపడలేదంటున్న రోజా వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా అని మోగా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు మాట్లాడే డిక్కీ బలిసిన కోడి, నన్ను రేప్ చేసే దమ్ము ఎవరికైనా ఉందా? వంటి మాటల భావితరాలకు ఇచ్చే సందేశం ఏమిటని నిలదీస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా రోజాని మెగా ఫాన్స్ కడిగిపారేస్తున్నారు.బ్లడ్ బ్యాంక్ ద్వారా గొప్ప కార్యక్రమాన్ని చిరంజీవి చేపడుతున్న విషయాలన్నీ ప్రస్తావిస్తున్నారు. ఇవేవీ రోజా కి కనిపించడం లేదా? అని అంటున్నారు.
చిత్రమేమంటే ప్రతి విషయంలోనూ రోజాను వెనకేసుకొచ్చే వారు సైతం ఇప్పుడు రోజాను తప్పుపడుతున్నారు. కోవిడ్ కష్టకాలంలో వైసీపీ నేతలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తే చిరు తను రాజకీయాల్లో లేకపోయినా తన స్థాయిలో ఆక్సిజన్ ప్లాంట్ల దగ్గర నుంచీ ఎన్నో విషయాల్లో సాయం చేశారు. సినీ పరిశ్రమలోని ఎంతో మంది కార్మికులను ఆదుకున్నారు. మరి రోజా సినీ పరిశ్రమలో ఇంత సాధించి... సంపాదించిం కార్మికులకు ఏమైనా సాయం చేశారా?
ఒకనాడు టిడిపిలో చేరి చంద్రబాబు పంచన చేరి వైయస్ రాజశేఖర్ రెడ్డిని తూలనాడిన రోజా ,ఇప్పుడు వైయస్ జగన్ పంచన చేరి చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ని విమర్శించడం ఏమిటని మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు ఒక వేలు ఎదుటివారిపై చూపించేటప్పుడు నాలుగు వేళ్లు మన వైపే చూపిస్తాయి అన్న విషయం రోజా తెలుసుకోవాలని అంటున్నారు?