చిక్కులు తెంచుకునేందుకే మోదీతో జగన్ భేటీ
posted on Aug 22, 2022 @ 4:43PM
పలు సమస్యలు చుట్టుముట్టడంతో ఊపిరాడక, పరిష్కారాలను అర్ధించేందుకు ఏపీ ముఖ్యమంత్రి ప్రధాని మోదీతో సోమవారం (ఆగష్టు22) సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవ రించిన అంచనాలు ఆమోదించాలని కోరినట్టు తెలిసింది. అందుకు సంబంధించిన నిధులు కూడా విడుదల చేయాలని అభ్యర్థించి నట్టు చెబుతున్నారు. నిర్వాసితుల ప్యాకేజీకి సంబంధించిన అంశాలను కూడా చర్చించారని వైసీపీ పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని ఇంకా పెండింగ్‌లో ఉన్న అంశాలు, నిధుల విడుదల అంశాలను ప్రస్తావించినట్టు తెలుస్తోంది.
సీఎం వైఎస్ జగన్ వెంట ఎంపీ విజయసాయి రెడ్డి ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. 30 నిముషాలపాటు ఇరువురి సమా వేశం జరిగింది. పలు కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ఉన్న కేసులకు తోడు వివేకా హత్య కేసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. వివేకా హత్య కేసులో త్వరలోనే కీలక పరిణామా లు జరుగుతాయంటూ ఇప్పటికే చర్చ జరుగుతోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లోనూ వైసీపీ నేతలకు లింకులు ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విజయ సాయి బం ధువులు సహా పలువురు వైసీపీ నేతల ప్రమేయంపై ఇప్పటికే ఆరోపణలు వచ్చాయి. ఏపీలో లిక్కర్ సహా ఇతర మాఫియాలు పాలిస్తున్నాయంటూ కేంద్ర మంత్రి ఠాకూర్ నిన్న వ్యాఖ్యలు చేసిన విషయం తెలి సిందే. డర్టీ వీడియోతో ఎంపీ గోరంట్ల వ్యవహారం కూడా జాతీయ స్థాయిలో చర్చ జరుగు తోంది. ఈ అంశా ల్లో తన ప్రభుత్వాన్ని కాపాడాలన్న లక్ష్యంతోనే జగన్ ప్రధాని మోదీతో సమావేశమ య్యారన్నది విశ్లేషకుల మాట.
ఎంపీ మాధవ్‌పై చర్యల కోసం ఇప్పటికే ప్రధాని, లోక్ సభ స్పీకర్, జాతీయ మహిళ కమిషన్‌కు ఫిర్యా దు లు వెళ్లువెత్తాయి. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ ఇప్పటికే ఆదేశిం చింది. ఈ పరిణామాలకు తోడు ఇటీవల ఢిల్లీలో చంద్రబాబు, మోదీ షేక్ హ్యాండ్‌తో వైసీపీ ఉలిక్కి పడింది. హైదరాబాద్‌లో అమిత్ షా, రామోజీరావు భేటీపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరిగింది. ఈ పరిణామా లన్నీ వైసీపీలో కలవరం రేపుతున్నాయి.