బీజేపీ నేతలపై కవిత పరువునష్టం దావా
posted on Aug 22, 2022 @ 3:59PM
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఆమెకు సంబంధం ఉందని బీ జేపీ ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సాలు సాక్ష్యాలతో సహా నిరూపించడానికి సిద్ధపడ్డారు. కానీ అందులో వాస్తవ మేమీ లేదని వారిపై పరువు నష్టం దావా వేయడానికే కవిత నిర్ణయించుకు న్నారు. తనపై నిరాధార ఆరో పణలు చేసినందుకు వ్యతిరేకంగా ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కూడా కోర్టును ఆశ్రయిం చనున్నారు.
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం విషయంలో ఇప్పటికే కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద భారీ ఆరోప ణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత భర్త సంబంధీకుల ప్రమేయం ఉందని, ఆమె దీనికి సంబంధించిన ఒప్పందాలను దగ్గరుండి నడిపించిదనే ఆరోపణ ఉన్నది. ఈ వ్యవహారంలో కీలకపాత్ర ఆమెదేనని ఢిల్లీ (వెస్ట్) ఎంపీ, బీజేపీ నేత పర్వేశ్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజీం దర్ సిర్సా ఆది వారం ఢిల్లీలో మీడియా కి వెల్లడించారు.
హైదరాబాద్ కోకాపేటకు చెందిన మద్యం వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లైను ఢిల్లీకి కేసీఆర్ తనయ కవితే తీసుకువచ్చారని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సింగ్ సిర్సా ఆరోపణ. ఆమె ఢిల్లీ, ఛండీగఢ్‌లలో జరిపిన సమావేశాల తర్వాతనే పంజాబ్, తెలంగాణాలో ఉన్న మద్యం విధానాలను ఆప్ నేతలు ఢిల్లీలోనూ అమలు చేశారని ఆయన అన్నారు. మద్యం వ్యాపారుల కమీషన్‌ను 12 శాతానికి పెంచడంతో పాటు, ఆక్షన్ లేకుండా హోల్‌సేల్ లైసెన్స్‌లు మంజూరు చేశారని మండిపడ్డారు. అసలు కవిత రాకతోనే పంజాబ్‌లో మహదేవ్ లిక్కర్స్ సంస్థ మూసివేయించడానికి కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా లకు రూ.4.5 కోట్లు ఇప్పించారని ఆయన ఆరోపించారు.
ఇదిలా ఉండగా, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని కేసీఆర్ తనయ కవిత ఢిల్లీ బీజేపీ నాయకుల మీద పరువునష్టం దావా వేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ మేరకు న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.