మణిపూర్ మండిపోతోంది
posted on May 8, 2023 @ 2:30PM
సెవెన్ సిస్టర్స్ అని భారతీయులు ప్రేమగా పిలుచుకునే ఈశాన్య రాష్ట్రాలలో పరిస్థితులు అదుపుతప్పుతున్నాయి. నేపాల్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ వంటి దేశాల సరిహద్దులుగా భారతదేశ పటానికి మరింత అందాన్ని అద్దే ఈశాన్య రాష్ట్రాలలో మణిపూర్ ఒక అద్భుతమైన రాష్ట్రం. ప్రకృతి అందాలతో ఈ ఏడు రాష్ట్రాలూ ఒకదానితో ఒకటి పోటీ పడుతూనే ఉంటాయి. దశాబ్ద కాలంగా మణిపూర్ రాష్ట్రంలో జాతల మధ్య పోరు సాగుతున్నా.. ప్రస్తుతం అది తీవ్రంగా మారింది.
యిక్కడ మొయితీ, కుకూ, నాగా జాతుల ప్రజలు ఎక్కువగా జీవిస్తుంటారు. వీరిలో కుకూ, నాగా జాతులు షెడ్యూల్ తెగలుగా గుర్తింపు పొందాయి. అయితే తమను కూడా ఎస్పీ జాబితాలో చేర్చాలంటూ మోయితీ తెగ ప్రజలు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోలేకపోయాయి.దీంతో అక్కడ పరిస్థితులుఅదుపు తప్పి దారుణ పరిస్థితులకు దారి తీశాయి. గత వారం రోజులుగా జరగుతున్న ఆందోనల్లో దాదాపు 60 మంది ప్రజలుచనిపోయారనీ, వంద మందికి పైగా గాయపడ్డారని, పాతిక వేల మందికి పునరావాసం కల్పించామని ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. కానీ అనధకారిక లెక్కల ప్రకారం ఈ అంకెలు యింకా ఎక్కువగానే అంటాయని విశ్లేషకులు అంటున్నారు.
మణిఫూర్ రాష్ట్రంలో మొయితీ తెగ ప్రజలు 54 శాతం మంది ఉండగా.. వారు అధికంగా మైదాన ప్రాంతాలలో నివశిస్తుంటారు. మే 29వ లోగా మోయితీ తెగ ప్రజలను ఎస్టీలుగా గుర్తించాల్సిందిగా మణిపూర్ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. దీంతో కుకూ, నాగా తెగ యువత ఆందోళనకు దిగింది. ఆందోళనలో భాగంగా భారీ ర్యాలీలు జరిగాయి.
పరిస్థితులను అదుపు చేసేందుకు అక్కడి బీజేపీ ప్రభుత్వం కుకూ, నాగా జాతి ప్రజలను పర్వత ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు బలవంతంగా తీసుకుకవస్తున్నారు. అడవి బిడ్డలమైన తమను అడవి నుంచి దూరం చేయడంతో కుకూ, నాగాలు తిరగబడుతున్నారు. వీరు క్రైస్తవాన్ని అనుసరిస్తుండగా, మొయితీలు హిందూ జీవన విధానాన్ని అనుసరిస్తుంటారు. ఈ కారణాలతో సహజంగానే పోరు మతం వైపు సాగింది. యింత వరకూ పాతిక చర్చీలు, 500కు పైగా ిళ్లుఅగ్నికి ఆహుతయ్యాయి. మణిపూర్ రాష్ట్రంలో అనేక విద్యాసంస్థలలో దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన విద్యార్థులుచ దువుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మిగిలిన రాష్ట్రాలు వారి వారి రాష్ట్రాల విద్యార్థులను తిరిగి రప్పించే పనిలో పడ్డాయి.
యిదిలా ఉండగా.. మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలకు కేంద్రంలో , రాష్ట్రంలో ఉన్న బీజేపీ కారణమని మణిపూర్ ట్రైబల్ ఫోరం సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేసింది. ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి మణిపూర్ ఛాయలకు కూడా వెళ్లకపోగా.. ప్రధాని, హోం శాఖ మంత్రి యిద్దరూ కర్నాటక ఎన్నికలలో బిజీగా ఉండడం కొసమెరుపు.