ఆధార్ ఎక్కడ అవసరం?
posted on May 8, 2023 @ 1:42PM
ఆధార్ అనివార్యత విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మార్గదర్శక సూత్రాలను జారీ చేసింది. ఆధార్ విలువ ఏ మాత్రం తగ్గలేదని సుప్రీం స్పష్టం చేసింది. ఆధార్ కార్డుఎక్కడ అవసరం? ఎక్కడ అవసరం లేదు? అనే విషయాలను సుప్రీం వెల్లడించింది. సుప్రీం తీర్పు ప్రకారం స్కూళ్లలో ఆధార్ కార్డు అవసరం లేదని చెప్పేసింది. అడ్మిషన్ తీసుకునే సమయంలో ఆధార్ కార్డు ఉండాలన్న నిబంధనను సుప్రీం కోర్టు కొట్టేసింది. స్కూళ్లలో సర్వశిక్షా అభియాన్ కోసం ఆధార్ కంపల్సరీ ఉండేది. ఇప్పుడు ఆ అవసరం లేదు.
ఆధార్ ఉంటేనే సర్వశిక్ష అలవుతుందన్న నిబంధనను సుప్రీం కొట్టివేసింది. ఇప్పటివరకు 6 నుంచి14 ఏళ్లలోపు ఆధార్ ఉంటేనే సర్వశిక్షా అభియాన్ కు అర్హత పొందేవారు. ప్రస్తుతం అటువంటి నిబంధనను సడలించారు. ఆధార్ తో మొబైల్ లికింగ్ అవసరం లేదని సు ప్రీం తేల్చేసింది. బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేయడానికి ఇప్పటి వరకు ఆధార్ అవసరమయ్యేది. ప్రస్తుతానికి సుప్రీం ఈ నిబంధనను మినహాయించింది. ప్రస్తుతం ఉన్న బ్యాంక్ అకౌంట్లకు ఆధార్ లింక్ అవసరం లేదని సుప్రీం స్పష్టీకరించింది. యుజీసీ, ఎన్ఇఇటీ, సీబీఈసీ తదితర సంస్ధలలో ఆధార్ అవసరం లేదు. ప్రయివేటు సంస్థల్లో పని చేసే ఉద్యోగ, సిబ్బంది నుంచి యాజమాన్యాలు ఇక నుంచి ఆధార్ కార్డులు అడగకూడదు. వ్యక్తి గత గోప్యతలో భాగంగా ఆధార్ అవసరం లేదని సుప్రీం స్పష్టీకరించింది.