Read more!

మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూత

ఘట్టమనేని కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

ఈ ఏడాది జనవరిలో మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కూడా అనారోగ్యంతో మృతి చెందారు. ఇప్పుడు కొద్ది నెలలకే ఆయన తల్లి కూడా మరణించారు. ఒకే ఏడాది ఆ కుటుంబంలో రెండు విషాదాలు చోటు చేసుకున్నాయి.

ఇందిరాదేవి మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆమె పార్ధివదేహాన్ని సందర్శన కోసం పద్మాలయ స్టూడియోలో ఉంచి, అనంతరం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నారు.