తక్కువ స్కోరు ... అయినా తప్పని టెన్షన్

 

ఐపిఎల్-6 లీగ్ దశ మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ మరోసారి తడబడింది. శుక్రవారం జరిగిన ఐపిఎల్- 6 లీగ్ మ్యాచ్ లలో భాగంగా ఢిల్లీ డేర్ డెవిల్స్ X సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాట్స్ మెన్ ఘోరంగా విఫలమయ్యారు. గత రెండు మ్యాచ్ లకు దూరంగా ఉన్న ఢిల్లీ డేర్ డెవిల్స్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ వీరేంద్ర సెహవాగ్ మరోసారి విఫలమయ్యాడు. టాస్ గెలిచి బ్యాంటింగ్ ని ఎంచుకున్న ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ మహేళా జయవర్థనే బ్యాంటింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ బ్యాట్స్ మెన్ వార్నర్ (0) మొదటి ఓవర్ నాలుగో బంతికే మిడాన్ లో స్టెయిన్ బౌలింగ్ లో రాజన్ క్యాచ్ పట్టడంతో తమ మొదటి వికెట్ ను కోల్పోయింది. వీరేంద్ర సెహవాగ్ (12)కు తోడుగా వచ్చిన జయవర్థనే (12) లను ఇషాంత్ శర్మ వరుసబంతులలో అవుట్ చేయడంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ పతనం ప్రారంభమైంది. బోథా (9), జునేజా (15) వికెట్లను కూడా కోల్పోయి కష్టాలలో వున్న డేర్ డెవిల్స్ ఇన్నింగ్స్ ను ఆఖరి ఓవర్లలో ఇర్ఫాన్ పఠాన్ (23), కేదార్ జాదవ్ (30) చెలరేగడంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ తమ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేయగలిగింది. స్టెయిన్ రెండు వికెట్లు, ఇషాంత్ రెండు వికెట్లు, పెరెరా రెండు వికెట్లు, అమిత్ శర్మకు ఒక వికెట్ దక్కింది. సునాయాసమైన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఒడిదుడుకులతో ప్రారంభమైంది. అక్షిత్ రెడ్డి రనౌట్ అవడంతో సన్ రైజర్స్ కెప్టెన్ సంగక్కర, పార్థివ్ పటేల్ ఇన్నింగ్స్ నిర్మించే పనిని చేపట్టి కావాల్సిన రన్ రేట్ తగ్గకుండా ఆడుతుండటంతో సన్ రైజర్స్ విజయం చాలా తేలిక అనుకుంటున్న సమయంలో పార్థివ్ పటేల్ ను నదీమ్ తన బౌలింగ్ లో నే క్యాచ్ పట్టి అవుట్ చేసాడు. తరువాత బ్యాటింగ్ కు దిగిన బ్యాట్స్ మెన్ సంగక్కర (28), బోథా (17), కెమరూన్ వైట్ (4) వికెట్లను వెంట వెంటనే కోల్పోవడంతో కష్టాలలో పడింది. చివర్లో ఆశీష్ రెడ్డి (16), అమిత్ మిశ్రా (16) నాటౌట్, స్టెయిన్ (9) నాటౌట్ గా నిలిచి రెండు బంతులు మిగిలి ఉండగానే అతి కష్టం మీద 7 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసి విజయం సాధించింది. అమిత్ మిశ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మోర్కెల్ రెండు వికెట్లు, నదీమ్ రెండు వికెట్లు, ఇర్ఫాన్ ఒక వికెట్, బోథా ఒక వికెట్ తీశారు. ఢిల్లీ డేర్ డెవిల్స్ కు ఈ సీజన్ లో వరుసగా ఇది నాలుగో పరాజయం.

ఏటీఎం వద్ద మోసాలకు పాల్పడుతున్న అంత రాష్ట్ర ముఠా అరెస్ట్

  హైదరాబాద్ నగరంలో ఏటీఎంల వద్ద కేవలం చదువురాని, వృద్ధులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని వారి దృష్టి మళ్లించి మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను మెహిదీపట్నం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.52,000 నగదు, వివిధ బ్యాంకులకు చెందిన 89 ఏటీఎం కార్డులు, మూడు సెల్‌ఫోన్లు మరియు ఒక ఆటో రిక్షాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన నిందితులు హర్యానాకు చెందిన అమీర్ సుహెల్ @ అమీర్ సోహైల్ @ సోహెల్ (24), ముబారిక్ (26), ముస్తకీమ్ (25)తో పాటు హైదరాబాద్‌కు చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ అమేర్ (33)ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో అమీర్ సుహెల్, ముబారిక్‌లు ప్రధాన నిందితులుగా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.... డిసెంబర్ 31న ఆసిఫ్‌నగర్‌కు చెందిన ఎలక్ట్రీషియన్ అలకుంట వెంకటేష్ (38) ఫిర్యాదు మేరకు ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అలకుంట వెంకటేష్ తన తల్లి ఏటీఎం కార్డులో ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలుసుకునేందుకు డిసెంబర్ 28న మల్లేపల్లి ఎక్స్‌రోడ్స్‌లోని ఎస్‌బీఐ ఏటీఎ వెళ్లాడు. కానీ ఇతనికి చదువు రాకపోవడంతో అక్కడున్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల సహాయం కోరాడు. వారు అతని తల్లి ఏటీఎం కార్డు తీసుకుని పిన్ నంబర్ తెలుసుకుని, అందులో 1,32,000 ఉన్నట్లుగా చెప్పారు. అనంతరం నిందితులు కార్డు మార్చిఅలకుంట వెంకటేష్ కు ఇచ్చారు.  కార్డు తీసుకుని వెంకటేష్ వెళ్లిన అనంతరం నిందితులు అసలైన కార్డుతో రూ.40,000 నగదు విత్‌డ్రా చేశారు. అనంతరం వెంకటేష్ తన తల్లి ఫోన్ కు బ్యాంకు నుండి వచ్చిన ఎస్ఎంఎస్ చూసి ఒక్కసారిగా అవాక్క య్యాడు. ఏటీఎం కార్డు తను వద్ద ఉండగా డబ్బులు ఎలా డ్రా అయ్యాయి అని బాగా ఆలోచించిన వెంకటేష్ కు ఏటీఎం కార్డు వద్ద నిందితులే తనను మోసం చేశారని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు వెంకటేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగించగా ఈ ముఠా వ్యవహారం కాస్త వెలుగులోకి వచ్చింది...ఈరోజు జనవరి 3 ఉదయం విజయ్‌నగర్ కాలనీలోని ఏటీఎం వద్ద మరో నేరానికి ప్రయత్నిస్తున్న సమయంలో సమాచారం అందుకున్న మెహిదీపట్నం క్రైమ్ సిబ్బంది నిందితులను పట్టుకున్నారు. విచారణలో వారు ఏటీఎం నేరాలకు పాల్పడుతున్నట్లుగా అంగీకరించారు. ప్రధాన నిందితుడు అమీర్ సుహెల్‌పై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే నాలుగు కేసులు నమోదై ఉండగా, రెండు నాన్ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు ముబారిక్ హర్యానాలో ఆటోమొబైల్ దొంగతనం కేసులో జైలుకు వెళ్లిన చరిత్ర ఉంది.చదువురాని వారు లేదా వృద్ధులు ఏటీఎంల వద్ద డబ్బులు విత్‌డ్రా చేయడం లేదా బ్యాలెన్స్ చెక్ చేసుకునే సమయంలో సహాయం చేస్తామని నమ్మించి, పిన్ నంబర్ తెలుసుకుని, కార్డులను మారుస్తూ ఖాతాల నుంచి డబ్బు కొల్లగొట్టడమే ఈ ముఠా ప్రధాన పద్ధతిగా పోలీసులు వెల్లడించారు.  నిందితులను అరెస్టు చేసి మెహిదీపట్నం పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెం. 365/2025 కింద సెక్షన్లు 318(4), 303(2) r/w 3(5) BNS ప్రకారం కేసు నమోదు చేసి నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ప్రజలకు పోలీసుల సూచన ఏటీఎం కార్డును ఎవరికీ ఇవ్వవద్దని, పిన్ నంబర్‌ను  ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని వ్యక్తులకు చెప్పవద్దని పోలీసులు సూచించారు. అవసరమైతే బ్యాంక్ సిబ్బంది సహాయం మాత్రమే తీసుకోవాలని హెచ్చరించారు.

కేసీఆర్ సంతకమే తెలంగాణ పాలిట మరణ శాసనమైంది : సీఎం రేవంత్

  కృష్ణా బేసిన్‌లో రాష్ట్ర ప్రాజెక్టులకు 490 టీఎంసీల కేటాయింపు ఉండేదని శాసన సభలో సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ విడిపోయే ముందు  కిరణ్ కుమార్ సర్కార్ 299 టీఎంసీల అని పేర్కొంది. ఆనాడు ఈఎన్‌సీగా ఉన్న మురళీధర్ రావు కూడా 299 టీఎంసీలే అని తప్పడు నివేదిక ఇచ్చారు. 490 టీఎంసీల కోసం పోరాడాల్సిన మాజీ కేసీఆర్ 299 టీఎంసీలకు అంగీకరిస్తూ సంతకం చేశారు. ఇదే తెలంగాణ పాలిట మరణశాసనంగా మారిందని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.  నిజాలన్ని బయటకు వచ్చే సరికి బహిరంగ సభల పేరుతో డ్రామాలకు తెరతీశారని సీఎం రేవంత్ అన్నారు. బండారం బయటపడుతుందని అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. నీళ్లను మీరు తాకట్టు పెట్టి మాపై నిందలు వేస్తున్నారని సీఎం అన్నారు. రాష్ట్ర నీటి హక్కులను కాపాడుకునేందుకు ప్రజలు ప్రత్యేక తెలంగాణ పోరాటం చేశారని ముఖ్యమంత్రి అన్నారు. కృష్ణా జిల్లాల్లో బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు కేటాయించింది. 2004లో బ్రిజేశ్‌కుమార్  ట్రిబ్యునల్ వేస్తే...2010లో తీర్పు వచ్చింది. ఇంకా ఆ తీర్పుపై 2010 నుంచి పంచాయితీ ఇంకా కొనసాగుతుంది. ఇవాళ కర్ణటక ప్రభుత్వం మళ్లీ అల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు సిద్దమైంది అని అన్నారు.  ఉమ్మడి రాష్ట్రంలో ఉన్పప్పుడే అప్పటి ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో వీలైనన్ని సాగునీటి ప్రాజెక్టులు మంజూరు చేసిందని పేర్కొన్నారు. 2005 నుంచి 2014 నాటికే కృష్ణా బేసిన్​లో ఎస్​ఎల్​బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి, మక్తల్ నారాయణపేట కొడంగల్​, కోయిల్ సాగర్ ​ప్రాజెక్టులు చేపట్టిందని తెలిపారు. 2014లో అధికారం చేపట్టిన బీఆర్​ఎస్ ఈ ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేయాల్సిందిపోయి అసంపూర్తిగా వదిలేసిందని పేర్కొన్నారు. కృష్ణా జలాలపై బహిరంగ సభలు కాదు.. సభలోనే చర్చించాలని మేం కెసీఆర్, హరీష్ ను ఆహ్వానించామని.. పదేళ్లు కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోయేందుకు సహకరించి తెలంగాణకు తీరని అన్యాయం చేశారు. వివరాలతో సభలో చర్చిద్దామంటే సభకు రాకుండా వెళ్లిపోయారని ముఖ్యమంత్రి మండిపడ్డారు.

గచ్చిబౌలి వద్ద కారు ఢీకొని జింకకు తీవ్రగాయాలు

  హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ అటవీ ప్రాంతం నుంచి ఓ జింక బయటకు వచ్చింది.  గచ్చిబౌలి-లింగంపల్లి పాత ముంబై జాతీయ రహదారిపైకి రావడంతో కారును జింక ఢీకొట్టింది. వెంటనే సమాచారం అందుకున్న హెచ్‌సీయూ యానిమల్ ప్రొటెక్షన్‌ టీమ్‌ అక్కడికి చేరుకుంది. అనంతరం, జింకను వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు.   జింక ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అటవీ ప్రాంతాలకు సమీపంగా ఉన్న రహదారుల్లో వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాలని అధికారులు సూచించారు. సెంట్రల్ యూనివర్సిటీ ఫారెస్ట్ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన ఒక జింక రోడ్డుపైకి అకస్మాత్తుగా రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో జింకకు గాయాలైనట్లు తెలిసింది.

పేదరికం నుంచి హింసా మార్గం వరకు...మావోయిస్టు దేవా జీవిత గమనం

  పేద ఆదివాసీ కుటుంబంలో జన్మించిన బర్సీ దేవా, చదువు మధ్యలోనే ఆపి మావోయిస్టు ఉద్యమంలో చేరాడు. 2003లో సీపీఐ మావోయిస్టు పార్టీలో అడుగుపెట్టిన అతడు, క్రమంగా కీలక పదవులు చేపట్టి PLGA బటాలియన్ కమాండర్ స్థాయికి ఎదిగాడు. ఐఈడీ పేలుళ్లు, అంబుష్ దాడులు, రాజకీయ నేతల హత్యలతో దండకారణ్యంలో రక్తపాతానికి కేంద్రంగా మారాడు. జీరాం ఘాటి వంటి సంచలన దాడుల్లో అతడి పాత్ర దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, సుక్మా జిల్లా, జగురుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని పువ్వర్తి గ్రామం బర్సీ దేవా స్వగ్రామం. తండ్రి దివంగత దేవా, తల్లి సింగే. అన్నయ్య సొండా, తమ్ముళ్లు ఐటల్, సన్నల్, బుద్రాల్ పువ్వర్తి గ్రామంలోనే నివాసం ఉంటున్నారు.  సోదరి మల్లే చిన్న బట్టి గూడెం గ్రామానికి చెందినవారు, ఆమె భర్త మడకం దేవా వ్యవసాయం చేస్తుంటారు. పువ్వర్తి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు చదివిన దేవా, అనంతరం జగురుగొండ ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు విద్యనభ్యసించాడు. 1997లో 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత చదువుకు పూర్తిగా వీడ్కోలు పలికాడు. 1998లో నందేను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం భద్రతా బలగాలకు మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా ఉన్న బర్సీ దేవా జీవితం పేదరికం నుంచి హింసాత్మక మార్గం వరకూ సాగిన ఒక వివాదాస్పద ప్రయాణానికి ప్రతీకగా నిలిచింది.

డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే కుమారుడు అరెస్టు… రాజకీయ వర్గాల్లో కలకలం

  డ్రగ్స్ వినియోగం కేసులో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి పోలీసులకు చిక్కడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. నార్సింగి పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో డ్రగ్స్ తీసుకుంటూ కనిపించిన సుధీర్ రెడ్డిని పోలీసులు పట్టుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సుధీర్ రెడ్డిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నార్సింగి ప్రాంతంలో అనుమానాస్పద కదలికలపై సమాచారం అందడంతో ప్రత్యేక బృందం తనిఖీలు చేపట్టింది. అదే సమయంలో సుధీర్ రెడ్డి మరో వ్యక్తితో కలిసి తిరుగుతుండగా పోలీసులకు అనుమానం వచ్చి వారిద్దరిని పట్టుకున్నారు. పోలీసులు ఆ ఇద్దరికీ డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు. దీంతో సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ వినియోగానికి అలవాటు పడిన వ్యక్తులను శిక్షించడమే కాకుండా, పునరావాసం కల్పించాలనే ఉద్దేశంతో సుధీర్ రెడ్డిని డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలించారు. సుధీర్ రెడ్డితో పాటు మరో వ్యక్తినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి తెచ్చుకు న్నారు? డ్రగ్స్ కి సంబంధించి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.ఇదిలా ఉండగా, సుధీర్ రెడ్డి గతంలో కూడా రెండుసార్లు డ్రగ్స్ వినియోగం కేసుల్లో దొరికినట్లు సమా చారం.  సుధీర్ రెడ్డి గతంలో కూడా రెండుసార్లు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డట్టు సమాచారం. అప్పట్లో హెచ్చరికలు, కౌన్సెలింగ్ ఇచ్చినా, మళ్లీ అదే బాటలో కొనసాగడం ఆందోళన కలిగిస్తోందని అధికారులు పేర్కొన్నారు. ఇటీవల కొంతకాలంగా కుటుంబ సమస్యలతో మానసిక ఒత్తిడికి లోనవుతున్నాడని, అదే డ్రగ్స్ వినియోగానికి దారితీసి ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.ఎమ్మెల్యే కుమారుడు డ్రగ్స్ కేసులో పట్టుబడటం ఇప్పుడు తాజాగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు పోలీసులు ‘చట్టం ముందు అందరూ సమానమే’ అన్న సందేశాన్ని స్పష్టంగా ఇస్తున్నారు.ఈ ఘటనతో డ్రగ్స్ నియంత్రణపై ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. పూర్తి విచారణ అనంతరం కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.  

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

  జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగనున్న వన్డే సిరీస్‌కు బీసీసీఐ టిమీండియా జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి రాగా పేసర్ మహమ్మద్ షమీకి మాత్రం మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. టీ20 వరల్డ్ కప్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వన్డే సిరీస్‌కు ఎట్టకేలకు శనివారం బీసీసీఐ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు సంబంధించి భారత జట్టును ప్రకటించింది.  గతేడాది అక్టోబర్ ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో క్యాచ్ అందుకునే క్రమంలో శ్రేయస్‌కు తీవ్రమైన గాయమైంది. దీంతో తర్వాత జరిగిన మ్యాచ్‌లకు అయ్యర్ దూరమయ్యాడు. డిసెంబర్ 25న (CoE)లో చేరిన శ్రేయస్.. స్ట్రెంత్‌ అండ్ కండీషనింగ్‌లో పురోగతి సాధించాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో నాలుగు సెషన్లపాటు కఠినమైన సాధన పూర్తి చేశాడు. మ్యాచ్ సిమ్యులేషన్‌ సెషన్స్‌లోనూ పాల్గొన్నాడు. దీంతో జట్టులో చోటు దక్కించుకున్నాడు. భారత తుది జట్టు ఇదే.. శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, జడేజా, సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్.  

మూడేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం...అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్

  ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులను వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి శాసన సభలో ప్రకటించారు. గతంలో శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తుంటే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చూస్తూ కూర్చుందని విమర్శించారు. ఏపీ రోజుకు 13 టీఎంసీలు తీసుకెళ్లేలా తమ ప్రాజెక్టును విస్తరించుకుందన్నారు. 34 శాతం నీళ్లు చాలని  బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సంతకాలు చేయడం వల్లనే ఈ సమస్య తలెత్తిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు.  కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన ఒక్క నీటి బొట్టు కూడా వదలమని పేర్కొన్నారు. ఈ విషయంలో వాళ్లేదో గొప్పగా చేసినట్లు, మేము ఏదో తప్పు చేసినట్లు  బీఆర్ఎస్ ప్రచారం చేస్తోందని..గత ప్రభుత్వం కంటే మేము సమర్థవంతంగా నీటి హక్కులను కాపాడుతూ వస్తున్నామని తెలిపారు. ఇంత కీలకమైన అంశంపై చర్చ జరుగుతుంటే బీఆర్ఎస్ రావకపోవడం దురదృష్టకరమని మంత్రి వెల్లడించారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం చేసింది గత ప్రభుత్వమే ఉత్తమ్ చెప్పారు.  

బళ్లారి కాల్పుల వివాదం...ఎస్పీ ఆత్మహత్యాయత్నం

  కర్ణాటక రాష్ట్రం బళ్లారి ఎస్పీ పవన్ నిజ్జూర్ ఆత్మహత్యాయత్నం చేశారు. ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి వర్గాల మధ్య వివాదం తలెత్తంది. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసి కాల్పుల వరకు వెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి బాధ్యడిని చేస్తూ బళ్లారి ఎస్పీని కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీంతో మనస్తాపానికి గురై  ఎస్పీ తుమకూరు జిల్లా శిరా తాలూకాలోని తన ఫామ్ హౌస్‌లో నిద్రమాత్రలు మింగి ఆయన ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు సమాచారం.   బళ్లారిలో వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కోసం ఎమ్మెల్యే వర్గీయులు  జనవరి 1, 2026న ఫ్లెక్సీలు కట్టే విషయంలో ఘర్షణపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ,  బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి అనుచరుల మధ్య తీవ్ర గోడవ చోటుచేసుకుంది. ఈ గొడవ ముదిరి రాళ్లు రువ్వుకోవడం, చివరకు కాల్పుల వరకు దారితీసింది. ఈ కాల్పుల్లో రాజశేఖర్ రెడ్డి అనే కాంగ్రెస్ కార్యకర్త ప్రాణాలు కోల్పోవడంతో బళ్లారిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.   ఈ కాల్పుల ఘటన రాజకీయంగా పెద్ద దుమారం రేపిం ది. ఈ ఘటనపై గాలి జనార్దన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీరాములు తదితరులపై కేసులు నమోదయ్యాయి. మరోవైపు, తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఇరువర్గాలు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. పోలీసులు ఈ కేసులో ఇప్పటికే 40 మందికి పైగా నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బళ్లారిలో హై టెన్షన్ మొదలైంది

న్యూయర్ రాష్ట్రానికి ఘనమైన ఆరంభం : సీఎం చంద్రబాబు

  పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ అగ్రస్థానంలో ఉన్నట్టు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆర్ధిక నివేదికలో వెల్లడించింది. దీనిపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రజలకు శుభావార్త అని, కొత్త సంవత్సరానికి ఘనమైన ఆరంభమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ముందు చూపుతో కూడిన విధాన సంస్కరణల వల్లే ఇది సాధ్యమైందని వెల్లడించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినేస్ కార్యక్రమాల ప్రభావాన్ని ఇది ప్రతిబింబిస్తుందన్నారు.  2026 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల కాలానికి (ఏప్రిల్-డిసెంబర్ 2025) దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం పెట్టుబడి ప్రతిపాదనల్లో ఏపీ ఏకంగా 25.3 శాతం వాటాను దక్కించుకుంది. ఈ విషయాన్ని బ్యాంక్ ఆఫ్ బరోడా తన తాజా ఆర్థిక నివేదికలో వెల్లడించింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (CMIE) డేటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఈ మేరకు ఫోర్బ్స్ బిజినెస్ మేగజైన్ ఓ కథనం వెలువరించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక ప్రకారం, ఈ తొమ్మిది నెలల్లో దేశవ్యాప్తంగా మొత్తం రూ.26.6 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ తర్వాత ఒడిశా (13.1 శాతం), మహారాష్ట్ర (12.8 శాతం) రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ మూడు రాష్ట్రాలు కలిపి దేశంలోని మొత్తం పెట్టుబడి ప్రతిపాదనల్లో 51.2 శాతం వాటాను ఆకర్షించడం గమనార్హం.

వెనిజులాపై అమెరికా బాంబు దాడులు

వెనిజులా నుంచి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడి పేరిట అమెరికా ఆ దేశంపై బాంబు దాడులకు దిగింది.  వెనిజులా రాజధాని కరాకస్‌లో శనివారం తెల్లవారుఝామున ఏడు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించడం ఆ దేశ వాసుల్ని భయభ్రాంతులకు గురిచేసింది. ఆ క్రమంలో దేశంలో ఎమెర్జన్సీ విధించాల్సిన పరిస్థితి తలెత్తింది. ట్రంప్ ఆదేశాలతోనే తమ సైన్యం ఈ దాడులు చేస్తోందని అమెరికా ధృవీకరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.  సైనిక స్థావరాలు, పౌర నివాసాలే లక్ష్యంగా అమెరికా దాడులకు పాల్పడినట్లు వెనిజులా వెల్లడించింది.  దాంతో సైనిక స్థావరాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలిపింది. దాడులు జరిగిన ప్రదేశాల్లో పరిస్థితిని సమీక్షించడానికి అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ దాడులతో దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు దేశాధ్యక్షుడు నికోలస్ మదురో ప్రకటించారు. ఈ దాడులకు వ్యతిరేకంగా ప్రజలు వీధుల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఈ దాడులకు ముందు అమెరికా విమానయాన సంస్థలకు యూఎస్ పెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నోటీసు జారీ చేసింది. అమెరికా విమానాలు వెనిజులా గగనతలాన్ని వినియోగించవద్దని హెచ్చరించింది. తాజా పరిణామాలపై కొలంబియా ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.  వెనిజులా ముఠాల నుంచి మాదక ద్రవ్యాలు అమెరికాను ముంచెత్తుతున్నాయని ట్రంప్ పలుమార్లు ఆరోపించారు. ఆ ముఠాలతో నికోలస్ మదుకోకు కూడా సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపి స్తుండటంతో.. అక్కడి ప్రభుత్వాన్ని కూల్చడానికి ట్రంప్ కార్యవర్గం ప్రణాళికలు రచిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ఇప్పటికే కరేబియన్ సముద్రంలో అమెరికా భారీగా బలగాలు, యుద్దనౌకలు, సబ్‌మెరైన్లు, అత్యాధునిక ఫైటర్ జెట్లను మొహరించింది.