కేసీఆర్ జాతీయపార్టీకి కుదరని ముహూర్తం
posted on Sep 21, 2022 @ 11:26AM
అన్నీ అనుకోగానే అయిపోతాయా? అది కొందరికి పట్టే అదృష్టం. చాలామంది విషయంలో జరగని కల. కొందరికి ఇవాళ, రేపు.. అంటూ ముహూర్తాల తేదీ మారిపోతూంటుంది. ఇపుడు తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ విషయంలోనూ అదే జరుగుతోంది. ఆయన జాతీయపార్టీ ఏర్పాటు ముహూర్తం తేదీ మళ్లీ మారింది. అదిగో ఇదిగో అన్నది అభిమానులను ఊరించింది. ఈమధ్య ఇదుగో దసరాకి ప్రకటిస్తారని అంతా సినిమాకోసం ఎదురుచూసినట్టు చూస్తున్నారు. ఇంతలో అబ్బే అక్టోబర్ 5కి ప్రకటించడం కష్టమన్నది తేలిపోయింది. దసరా ముహూర్తం దాటిపోయింది గనుక ఇక ఈ ఏడాది డిసెం బర్ లోనే బిఆర్ ఎస్ పార్టీ అధికారికంగా ప్రకటించవచ్చు.
ముహూర్తం మార్పు పంతులుగారు ఇంకా తేల్చలేకపోవడం కాదుట..కొత్త పార్టీ మానిఫెస్టోలో అంశాలు ఇద మిద్ధం ఏమి ఉండాలన్నది ఇంకా తేలకపోవడమేనట. మరీ ముఖ్యంగ నీరు,విద్యుత్, వ్యవసాయం, జాతీ య పార్టీ పతాక రూపకల్పన మొదలైన అంశాల్లో పాలసీ ఎలా ఉండాలన్నది ఇంకా నిపుణుల కమిటీ తేల్చలేదట. అంతేకాదు పార్టీ అధికారికంగా ప్రకటించడానికి ముందు మరిన్ని కీలకాంశాల గురించి దాదా పు ప్రతీరోజూ ఇంకా చర్చిస్తున్నారని టీఆర్ ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
జాతీయస్థాయిలో కొత్త పార్టీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చినపుడు విజయదశమిరోజునే ప్రకటించా లనుకున్నారు. అయితే ఎన్నికల కమిషన్ వద్ద పార్టీ రిజిస్టర్ చేయించే పనులు ఇంకా పూర్తగాకపోవ డంతో అపుడు అధికారికంగా ప్రకటించడానికి వీలులేకపోయింది. కాగా టీఆర్ ఎస్ పార్టీని కొత్తగా ప్రతిపాదిస్తున్న జాతీయపార్టీలో కలపడం విషయంపైనా పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఇంకా చర్చిం చాల్సి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై సుదీర్ఘ చర్చ తర్వాత ఆ రిజల్యూషన్ కాపీని ఈసీకి అందజేయ వలసి ఉంటుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జాతకాలమీద ఎంతో నమ్మకం ఉంది. కనుక మంచి ముహూర్తం కోసం పట్టుపడు తుం డడంతోనూ కొత్త జాతీయ పార్టీ ప్రకటన జాప్యం అవుతోందని అంటున్నారు. అందరూ ఎంతో ఆలోచించి, ఎంతమందితోనో సమాలోచన చేసి అక్టోబర్ 5ని నిర్ణయించారు. ఆ రోజు మంచి కార్య్ర కమాలు ఆరంభించవచ్చని అందరూ ఒక్కమాటగా సీఎంకి తెలియజేశారు.
కాగా ప్రస్తుతం మూఢాలు నడుస్తున్నాయి కనుక కొత్తపార్టీ ప్రకటన ముహూర్తాన్ని డిసెంబర్ 12కి వాయిదా వేశారు. అందువల్ల అప్పటివరకూ వేచి ఉండాల్సి వస్తుంది. ఈలోగా పార్టీ సంబంధించిన ఇతర అంశా లపై, విధివిధానా లను నిర్ణయించుకో వడంపై చర్చలమీద దృష్టిపెడుతున్నారు. ఒకవేళ డిసెంబ ర్ 12 కూడా కుదరకపోతే ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ వేచి ఉండాల్సి వస్తుందని రామడుగు కళ్యాణశర్మ పండితులు తెలియజేశారట.