లిక్కర్ స్కాం కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు
posted on Sep 12, 2025 @ 2:52PM
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు బిగ్ షాక్ తగిలింది. నిందితులకు ఈనెల 18 వరకు రిమాండ్‌ను పొడిగించింది. విజయవాడ జిల్లా జైలుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మిగతా నిందితులను రాజమండ్రి సెంట్రల్‌కు తరలిస్తున్నారు. మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఎంపీ మిథున్ రెడ్డికి ఉప రాష్ట్రపతి ) ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఇటీవలే విజయవాడ ఏసీబీ కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే ఢిల్లీకి వెళ్లిన మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ గడువు నిన్నటితో ముగియడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లోకు తరలించారు.
మరోవైపు మాజీ మంత్రి నారాయణస్వామి మొబైల్ ఫోన్‌ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్‌ఎస్‌ఎల్)కు పంపేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది. దీంతో సిట్ అధికారులు మొబైల్ ఫోన్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. గత వైసీపీ హయాంలో నారాయణస్వామి ఎక్సైజ్‌శాఖ మంత్రిగా పనిచేశారు. మద్యం కేసులో ఇటీవల ఆయన్ను సిట్ అధికారులు ప్రశ్నించారు. అనంతరం నారాయణస్వామి మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ధనుంజయరెడ్డి, గోవిందప్ప బాలాజీ ఆబ్సెంట్ పిటిషన్ వేయడంతో మిగిలిన 10 మందిని కోర్టుకు తీసుకొచ్చారు.