నీవు నేర్పిన విద్యయే .!
posted on Jul 26, 2022 @ 5:29PM
నేను కొట్టినపుడు ఏడవకూడదు నువ్వ నన్ను తిడితే ఎంత బాధో తెలుసా అన్నది చిన్న కోడల్ని పెద్ద కోడలు. కాపురానికి వచ్చినప్పటి నుంచి తిట్లూ శాపనార్ధాలూ అయి ఇపుడు తిట్టుకోవడం, కొట్టుకోవడం దాకా సాగిన వారి స్నేహపూర్వక అత్తింటి యాత్ర ఊహించని మలుపులకు దారి తీసింది. ఇలానే ఉంది, కాంగ్రెస్ వారు బీజేపీని తిట్టుకోవడం. వారి పాలనలో చేసినది, జరిగినదంతా మర్చిపోవాలి, బీజేపీ వారు దారుణంగా వ్యవహరిస్తున్నారని వీరి తరఫున దేశ ప్రజలంతా రోడ్డు మీదకి రావాలంటున్నారు. ఇంత కంటే హాస్యం మరోటి ఉంటుందా?
మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ మంగళవారం రెండోసారి విచారి స్తోంది. సోనియా గాంధీని ప్రశ్నించడంపై కాంగ్రెస్‌లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులతో సహా పార్టీ కార్యకర్తలు దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపు తున్నారు. అయితే.. ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద నిరసన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలతో రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత అతన్ని ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ గాంధీని కింగ్స్‌వే క్యాంప్‌కు తరలించారు. నిజానికి రాహుల్ గాంధీ రాష్ట్రపతిని కలవాలని, మెమోరాండం ఇవ్వాలని అను కున్నారు. కానీ విజయ్ చౌక్ దాటి వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో రాహుల్ విజయ్ చౌక్ వద్ద ధర్నాకు దిగారు. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో, పార్టీ పెద్ద నాయ కులు పార్లమెంట్ కాంప్లెక్స్ నుంచి విజయ్ చౌక్ వరకు మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వురు కాంగ్రెస్ ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ఎంపీలు విజయ్ చౌక్‌కు చేరుకున్నారు. నిరు ద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అనేక ఇతర సమస్యలపై ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం, పోలీసుల తీరుపై మండిపడ్డారు. పోలీస్ రాజ్యం నడుస్తోందని ప్రధాని మోదీ రాజులా వ్యవహరిస్తున్నారని విమ ర్శించారు. పార్లమెంటు లోపల చర్చకు అనుమతి ఇవ్వకుండా పోలీసులు మమ్మల్ని అరెస్టు చేస్తు న్నారు. పోలీసుల అనుమతితోనే తాము నిరసన తెలుపుతున్నామని కాంగ్రెస్ నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ఇదంతా ప్రతిపక్షా లను తొక్కేసేందుకే ప్రధాని మోదీ, అమిత్ షాల కుట్రని విమర్శిం చారు. మేము భయ పడం, మా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఇప్పుడు విచారణకి వెళ్ళకుండా ఉండాలంటే అప్పుడు తప్పు చేయకుండా ఉండాలి అని అనుకుంటు న్నారు. మనం ఏది ఇస్తామో, ఇచ్చామో అదే మనకి తిరిగివస్తుంది అనేది మాత్రం ఇప్పుడు గాంధీ ల కుటుంబానికి అవగతం అవుతున్నాటు ఉంది.