వీఆర్ఏ సూసైడ్.. ఎందుకో తెలుసా?
posted on Apr 26, 2021 @ 5:02PM
ఆమె పేరు మహంకాళి దివ్య. ఆమె పెద్దపల్లిలో నివాసం ఉంటుంది. ఆమె నిమ్మనపల్లి గ్రామ వీఆర్ఏ. ఆమెకు గతంలో పెళ్లి అయింది. కుటుంబంలో గొడవల కారణంగా విడాకులు కూడా అయ్యాయి. పనిచేసే చోట్ల ఈ వేధింపులకు గురి అయింది. తోటి ఉద్యోగులే మహిళల పాలిట చాలా నీచంగా వ్యవహరించారు. అయితే సమాజంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా చాలా వరకు మహిళ ఉద్యోగులు ఇలాంటి వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. కొందరైతే వేధింపులు భరించలేక.. ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ వీఆర్‌ఏ తోటి ఉద్యోగి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
ఓపెన్ చేస్తే.. ఆమెకు పెద్దపల్లి జిల్లా సబితం గ్రామానికి చెందిన శేఖర్‌తో కొన్నెళ్ల కిందట వివాహం జరిగింది. దివ్య నిమ్మనపల్లి వీఆర్‌ఏగా విధులు నిర్వర్తిస్తుంది. ప్రస్తుతం పెద్దపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో డెప్యూటేషన్‌పై పనిచేస్తోంది. భర్త నుంచి విడాకులు పొందిన దివ్య ను తోటి ఉద్యోగి అయితే కొద్దికాలంగా కొత్తపల్లి గ్రామ వీఆర్‌ఏ పెర్క వెంకటేశ్.. ప్రేమ పేరుతో వెంటపడి వేధించడం స్టార్ట్ చేసిశాడు. ఆమె నో చెప్పింది.. ఈ విషయమై దివ్య కుటుంబసభ్యులు అతడిని పలుమార్లు హెచ్చరించారు. అయినా వెంకటేష్ వినలేదు అక్కడితో ఆగకుండా.. తనను పెళ్లి చేసుకోవాలంటూ కార్యాలయంలోని ఓ తాత్కాలిక ఉద్యోగి ద్వారా మధ్యవర్తిత్వం కూడా నడిపాడు. శనివారం రాత్రి నేరుగా దివ్య ఇంటికి వెళ్లి గొడవ చేశాడు ఆ నీచుడు..
కట్ చేస్తే.. చీకటి పడింది.. ఆ తర్వాత తెల్లారింది.. దివ్య తమ్ముడు నిద్రలేచి చూసే సరికి.. ఇంట్లో రెండు కాళ్ళు వేలాడుతున్నాయి.. అక్క అక్క అని అరిచాడు ఆ తమ్ముడు.. ఎంత అరిచినా ఆ తమ్ముడి అరుపులు ఆ అక్కకి వినిపించలేదు.. ఎందుకంటే ఆ అక్క ప్రాణం అప్పటికే గాలిలో కలిసిపోయింది.. వెంకటేష్ ఆ ముందు రోజు రాత్రి దివ్య ఇంటి దగ్గర చేసిన రచ్చకి.. మనస్తాపంచెంది.. ఇంట్లో అందరూ నిద్రపోతున్న సమయంలో తన చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది దివ్య..దివ్య సోదరుడు దిలీప్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు దివ్యకు తల్లిదండ్రులు పోచమ్మ, నర్సయ్య సోదరులు దిలీప్, దినేశ్ ఉన్నారు.