కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్ధులు వీరేనా!!
posted on Jan 27, 2014 @ 3:37PM
రాజ్యసభ అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు పూర్తిచేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రం నుంచి కేవీపి రామచంద్రారావు, ఎంఎ ఖాన్, కొప్పులరాజు పేర్లను ఖరారు చేసినట్లు విశ్వాసనీయ సమాచారం. వారి పేర్లను ఈరోజు సాయంత్రం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కెవిపి రామచంద్ర రావును నిలబెడితే ఎక్కువ మంది మద్దతిచ్చే అవకాశం ఉండటమే కాకుండా కొంత రెబల్ సమస్య తగ్గే అవకాశముంది. ఈ కారణంతో అధిష్టానం కెవిపి పేరును మరోసారి తెరపైకి తీసుకు వచ్చిందంటున్నారు. మరోవైపు రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్దుల జాబితాను అధిష్టానం అధికారికంగా విడుదల అయ్యాక తమ నిర్ణయం తెలియజేస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి పేర్కొన్నారు. తాను, గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాపరెడ్డి ఎవరో ఒకరు బరిలో ఉంటామని ఆయన జేసీ పేర్కొన్నారు.