కేశినేని నాని స్వయంకృతమే!
posted on Jan 9, 2024 @ 2:24PM
కేశినేని నాని తెలుగుదేశం పార్టీని వీడటం అన్నది ఎప్పటి నుంచో అనుకుంటున్నదే. చివరికి అదే జరిగింది. ఇంత కాలం తెలుగుదేశం పార్టీతో ట్రావెల్ చేసినా నాని పార్టీని వీడినందుకు ఎవరూ బాధపడే పరిస్థితి లేదు సరికదా హమ్మయ్య ఇప్పటికైనా బయటకు పోయారు అదే చాలు అన్న భావన తెలుగుదేశంలో లీడర్ నుంచి క్యాడర్ దాకా వ్యక్తం అవుతోంది. చాలాకాలం నుంచి మరీ ముఖ్యంగా 2019 ఎన్నికలలో ఎంపీగా తెలుగుదేశం తరఫున విజయవాడ నుంచి లోక్ సభకు ఎన్నికై, ఆ ఎన్నికలలో పార్టీ పరాజయం పాలైనప్పటి నుంచీ నానిలో అంత వరకూ కనిపించని అహం ఒక్కసారిగా జడలు విప్పుకుని మరీ బయటపడింది. పార్టీ పరాజయం పాలై, అంతటి వ్యతిరేక పవనాలలోనూ తాను గెలవడం అంటే.. పార్టీ కంటే తానే ఎక్కువ అని భావించిన నాని అప్పటి నుంచీ పార్టీ లేక్కేమిటి? అన్నట్లుగా వ్యవహరించడం మొదలు పెట్టారు. అతడి దుందుడుకు వైఖరినీ, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరునూ గమనించినా, చాలా కాలంగా పార్టీలో ఉన్నాడన్న భావనతో ఆయనపై కనీస చర్యలు కూడా పార్టీ అధినేత తీసుకోకపోవడంతో కేశినేని నానిలో అహం మరింత ఎక్కువైంది. తాను అనుకున్న దానికి భిన్నంగా పార్టీ ఏం చేసినా అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా, తాను ఇంకా పార్టీలో కొనసాగడం తెలుగుదేశం అదృష్టం అన్న ధోరణిలో వ్యవహారం సాగించారు కేశినేని నాని. కొడాలి నానికి నిజాయితీపరుడుగా పేరుంది. ఇంత కాలం ఎంపీగా ఉన్నా ఎక్కడా ఎన్నడూ అవినీతి మరక అంటలేదు. అయితే ఆయన వ్యవహారశైలి మాత్రం పార్టీలో ఆయన పట్ల వ్యతిరేకత పెరగడానికీ, పార్టీ కేడర్ నుంచి నాయకుల వరకూ ఆయనకు దూరం జరగడానికీ దోహదపడింది తప్ప మరో ప్రయోజనం చేకూరింది లేదు. వ్యవస్థకు తప్ప, వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వని తెలుగుదేశం వంటి పార్టీలో … వ్యక్తిగత ప్రాధాన్యం కోరుకోవడం, అందుకు భిన్నంగా జరిగితే ఇష్టారీతిగా సొంత పార్టీనీ, నాయకులను విమర్శించడం చేసే నాని ధోరణే చివరకు ఆయన పార్టీ వీడేలా చేసింది.
నిజానికి గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ముగ్గురు ఎంపీలలో కేశినేని నాని మినహా మిగిలిన ఇద్దరూ పార్టీ విధానాలకు లోబడే వ్యవహరించారు. ఒక్క నాని మాత్రమే అందుకు భిన్నంగా వ్యవహరించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబును సైతం ధిక్కరించి ఒక విధమైన అరచకానికి తెరలేపారు. చివరికి ఆ వైఖరే నాని టీడీపీ నుంచి బయటక వెళ్లడానికి కారుణమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంత అహంకారంతో వ్యవహరించే నాని నిజానికి మంచి ఆరేటర్ కాదు, అలాగే ప్రజలలో విశేష అభిమానం ఉన్న వ్యక్తి కూడా కాదు. అయితే ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా మాత్రమే నానికి గుర్తింపు, స్థానం యోగ్త ఉ:టాయని జగన్ అలాగని నాని మంచి వక్త కాదు. గ్లామర్ ఉన్న లీడర్ కాదు. జనాలకు అందుబాటులో ఉండే నాయకుడంతే!
అయితే కేశినేని నానికి సొంత పార్టీ నేతలతోనే పెద్దగా పొసగదు. దాదాపు పార్టీ నాయకులందరితోనూ ఆయనకు విభేదాలే. సొంత పార్టీ నేతలపైనే బహిరంగంగా విమర్శలు, పరోక్షంగా దూషణలు చేయడం నానికి ఈ నాలుగున్నదేళ్లుగా ఒక అలవాటుగా మారింది. చివరాఖరికి తిరువూరులో వైసీపీ ఎమ్మెల్యేపై యుద్ధం చేస్తున్న తెలుగుదేశం నేతల మనోభావాలు దెబ్బతినేలా.. అధికార పార్టీ ఎమ్మెల్యేపై పొగడ్తలవర్షం కురిసిస్తారు కేశినేని నాని. ఆయన ఈ వైఖరి కారణంగానే తెలుగుదేశంలో ఆయనకు సన్నిహితుడు, స్నేహితుడు అని చెప్ుకోవడానికి ఎవరూ లేకుండా పోయారు.
ఇక పార్టీకి కేశినేని నాని ఇప్పుడు కాదు ఎప్పుడో దూరం అయిపోయారు. తెలుగేదేశం పార్టీకి పెద్ద పండుగ లాంటి మహానాడుకూ ఆయన దూరంగా ఉన్నారు. అలాగే పార్టీలో, పార్టీ క్యాడర్ లో చైతన్యం నింపిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకూ ఆయన దూరం అయ్యారు. అలాగే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకూ ఆయన హాజరు కాలేదు. దీనిని బట్టే కేశినేని నాని పార్టీకి ఎప్పుడో దూరమయ్యారని అవగతమౌతుంది. అందుకే కేశినేని నాని పార్టీని వీడుతున్నానని ప్రకటించినా ఆయనను బుజ్జగించడానికి కానీ, వద్దని వారించేందుకు కానీ తెలుగుదేశం నుంచి ఒక్కరంటే ఒక్కరు కేశినేని నానికి మద్దతు ఇచ్చిన వారు లేరు.