కిరణ్ పార్టీ వార్తలకు చెక్!

 

 

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో కొత్త పార్టీ పెట్టబోతున్నారన్న ఊహాగానాల పై ఆయన స్పందించారు. శ్రీకాకుళంలో దానికి సమాధానం చెబుతూ కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన తనకు లేదని చెప్పడం విశేషం. వరదబాధితుల ను పరామర్శించడానికి వెళ్లిన కిరణ్ రెడ్డి అక్కడ విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశాడు. విభజన నేపథ్యంలో కొత్త పార్టీ ఆలోచనేమీ తనకు లేదని ఆయన వ్యాఖ్యానించాడు.


తను సమైక్యవాదినంటున్న కిరణ్ రెడ్డి సమైక్య కాంగ్రెస్ ను నెలకొల్పనున్నాడనే వార్తలు వచ్చాయి. దీనికి అనుగుణంగా అనేక మంది కాంగ్రెస్ నేతలుకూడా కిరణ్ కొ్త పార్టీ పెడితే బావుంటుందన్నట్టుగా మాట్లాడారు. దీంతో ఊహానాలు జోరందుకొన్నాయి. రాష్ట్ర రాజకీయాల్లోకి కొత్త పార్టీతో కిరణ్ రెడ్డి కొత్త రకంగా ఎంట్రీ ఇస్తాడని విశ్లేషకులు అభిప్రాయపడసాగారు.