ఈ హడావుడి మామూలే
posted on Oct 31, 2013 @ 3:34PM
మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో ఆర్టీయే అధికారులు చాలా హడావుడి చేస్తున్నారు. భారీ ప్రమాదం జరిగిన నేపథ్యంలో అధికారులు ప్రైవేట్ బస్సుల ఫిట్ నెస్ పై దృష్టి సారించారు. ప్రమాణాలకు తగ్గట్టుగా లేని బస్సులను సీజ్ చేశారు. ఆర్టీఏ అధికారులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రైవేట్ బస్సులపై సోదాలు నిర్వహిస్తున్నారు. రికార్డులు సరిగా లేని ఐదు బస్సులపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్, విజయవాడ శివార్లలోనూ తనిఖీలు చేపడుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారిలో మూడు బస్సులను అధికారులు సీజ్ చేశారు. విజయవాడలో పర్మిట్లు లేని పలు ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సులను జప్తు చేశారు.
అయితే ఈ విషయంలో అధికారులకు ప్రశంసలు కన్నా విమర్శలే ఎదురవుతున్నాయి. ఇన్ని రోజులూ వీళ్లు ఏం చేశారు? తీవ్రమైన ప్రమాదం జరిగి.. అంత మంది చనిపోతే తప్ప.. అధికారుల నిద్రమత్తు వదల్లేదా? అనే సందేహం తలెత్తుతోంది. అయితే ఈ హడావుడి ఎక్కువ రోజులు ఉండదు. గతంలో షిరిడీ బస్సు ప్రమాదం అనంతరం కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తించింది. మళ్లీ అంతా మామూలే! ఇప్పుడు కూడా అంతేనేమో!