ఐసీసీ బెస్ట్ టీమ్ లో కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్
posted on Nov 15, 2022 6:45AM
టీ20 ప్రపంచకప్ 2022 ముగిసిన మరుసటి రోజే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అత్యంత ఆటగాళ్లతో కూడిన బెస్ట్ టీమ్ ప్రకటించింది. ఆ జట్టులో భారత నుంచి కింగ్ కోహ్లీకి, 360 డిగ్రీల ఆటగాడిగా గుర్తింపు పొందిన సూర్యకుమార్ యాదవ్ కు చోటు లభించింది. మొత్తం ఆరు దేశాలకు చెందిన ఆటగాళ్లకు ఈ జట్టులో అవకాశం దక్కింది.
ఐసీసీ బెస్ట్ టీమ్ కు ఇంగ్లండ్ కెప్టెన్ వికెట్ కీపర్ , ఓపెనర్ జోస్ బట్లర్‌ను కెప్టెన్ గా ఎంపిక అయ్యాడు. ఈ బెస్ట్ టీమ్ కు జొస్ బట్లర్, అలెక్స్ హేల్స్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, గ్లెన్ ఫిలిప్స్ (న్యూజిలాండ్)లకు అవకాశం దక్కింది.
అలాగే ఆల్‌రౌండర్లు సికందర్ రజా (జింబాబ్వే), షాదాబ్ ఖాన్ (పాకిస్తాన్)లకు ఛాన్స్ లభించింది. ఇక బౌలర్లు సామ్ కరన్, అన్రిచ్ నోర్జ్ (దక్షిణాఫ్రికా), మార్క్ వుడ్ (ఇంగ్లండ్), షాహీన్ అఫ్రిది (పాకిస్తాన్)లకు ఐసీసీ బెస్ట్ జట్టులో అవకాశం అభించింది. ఇక హార్ధిక్ పాండ్యా 12వ ఆటగాడిగా ఎంపికయ్యాడు.