తెలంగాణాలో మళ్ళీ ఓదార్పు లు
posted on Feb 24, 2014 @ 2:29PM
తెలంగాణ ఉద్యమ సమయంలో 'సమైక్యాంధ్ర' నినాదం అందుకొని సీమాంధ్రపై పట్టుకోసం వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి గట్టిగా కృషి చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం కాకపోయినా సీమాంధ్రపై పట్టు కోసం నిరాహార దీక్షలు, ధర్నాలు, సమైక్య సభలు, శంఖారావాలు అంటూ చాలానే చేశారు. అయితే రాష్ట్ర విభజన జరిగిపోయింది గనుక మళ్ళీ తెలంగాణలో భవిష్యత్తుపై దృష్టి పెట్టారు. ఈ రోజు తెలంగాణ నేతలతో జగన్ భేటి అయ్యారు. తెలంగాణలోనూ పార్టీ స్థానిక సమస్యలపై దృష్టిపెడుతుందనీ, పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్ళాలని వైఎస్ జగన్ ఆయా నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. మళ్ళీ తెలంగాణాలో పార్టీ నేతలను వెతుకొంటూ జగన్ త్వరలో అంటే మార్చి15 నుండి నల్గొండలో ఓదార్పు యాత్రలు చెప్పట్టబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సంబరాలు చేసుకుంటున్న తెలంగాణ ప్రజలకు ఆయన ఓదార్పు దేనికో?