సెక్షన్ 8 పై ఇద్దరు సీఎంల పోరు... కేంద్రాన్నైనా ఢీకొంటాం.. కేసీఆర్
posted on Jun 16, 2015 @ 12:21PM
ఒకవైపు ఏపీ ప్రభుత్వం హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయమని పట్టుబడుతుంటే.. మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం సెక్షన్ 8 అమలు అనసరం లేదని చెపుతోంది. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఅర్, గవర్నర్ భేటీ అయి గంటన్నరపాటు చర్చించుకున్నారు. అయితే కేసీఆర్ మాత్రం ఈ విషయంలో చాలా మొండిగా ఉన్నట్టు తెలుస్తోంది. నోటుకు ఓటు కేసులో చట్టం తన పని తాను చేసుకపోతుందని, దీనిని అడ్డంపెట్టుకొని సెక్షన్ 8 అమలు చేస్తామంటే ఊరుకునేది లేదని దీనిని మేము ప్రతిఘటిస్తామని గవర్నర్ కు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై కేంద్రంతో పోటీ పడటానికైనా సిధ్దమని కేసీఆర్ తెలిపారు. తెదేపా నేతలు తమ ఫోన్ ట్యాపింగ్ లకు గురయ్యాయని తెగ మొత్తుకుంటున్నారు కానీ అలా చేయలేదని దానికి సంబంధించిన నివేదికలు కూడా ఏసీబీ కేంద్రానిక సమర్పించిందని కేసీఆర్ అన్నారు.
మరోవైపు ఏపీ చంద్రబాబు కూడా సెక్షన్ 8 అమలుపై చాలా పట్టుదలతో ఉన్నారు. దీనిలో భాగంగా ఆయన గవర్నర్ సలహాదారులు ఏపీవీఎన్ శర్మ, ఏకే మహంతిలతో సమావేశమయ్యారు. సెక్షన్ 8 అమలు విషయంలో చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారని, ఏదో ఒక నిర్ణయం తీసుకోవడమే సమంజసంగా ఉంటుందని సలహాదారులిద్దరూ గవర్నర్‌కు సూచించారు. చూడాలి ఇద్దరి సీఎంలలో ఎవరి పట్టదల నెగ్గుతుందో.