జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఫోకస్
posted on Apr 29, 2023 @ 1:12PM
ఈ నెల 30న హైదరాబాద్లో కొత్త సచివాలయ కాంప్లెక్స్ ప్రారంభమైన తర్వాత బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల మీద ఫోకస్ పెట్టింది. మే ఒకటిన బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ బిజేపి యేతర పార్టీలను కూడగట్టడంలో ఢిల్లీలో నిమగ్నం కానున్నారు. ఎలాగైనా కేంద్రంలో బీజేపీని అధికారంలో రాకుండా చేయాలన్నది కేసీఆర్ తాపత్రయం. లోకసభ ఎన్నికలు 2014లో జరుగనున్నాయి. సమయం తక్కువగా ఉంది. బీజేపీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కేసీఆర్ కు ఇదే మంచి సమయం . కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ అని గతంలో కాళ్లకు చక్రాలు కట్టుకు తిరిగిన కేసీఆర్ ఇప్పుడు రూటు మార్చాడు. కేవలం బీజేపీ మాత్రమే టార్గెట్. తన కూతురు మద్యం కేసులో చిక్కుకోవడం, మళ్లీ బీజేపీ అధికారంలో వస్తే దర్యాప్తు వేగవంతమై శిక్షలు పడతాయన్న భయమే కేసీఆర్ ను బీజేపీ ప్రధాన శత్రువు అయ్యేలా చేసింది. తన కూతురును సీబీ ఐ వేధిస్తుందని మాట మాత్రమైనా కేసీఆర్ అనలేదు. కూతురుకు అన్యాయం జరుగుతుందని మీడియాతో కూడా అనడం లేదు. కూతురు ప్రస్తావన లేకుండానే బీజేపీని విమర్శిస్తున్నారు. తెలంగాణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారం రాష్ట్ర బిజేపీకి మేత దొరికినట్టయ్యింది. ఈ స్కాంలో కేటీఆర్ పేరు వినిపిస్తుంది. ప్రతీరోజు బీజేపీ నేతలు కూతురు, కొడుకులను విమర్శించడం కేసీఆర్ సహించలేకపోతున్నారు.ఈ కారణంగా జాతీయ రాజకీయాల మీద కేసీఆర్ మమకారం పెంచుకున్నారు.
పార్టీకి చెందిన ముఖ్యులు దాదాపు 200 మంది ఢిల్లీలోని భవన నిర్మాణ శంఖు స్థాపన పనుల ప్రాంభోత్సం సందర్బంగా అప్పట్లో హాజరయ్యారు. ఎంఎల్ఏలు, ఎంఎల్ సిలు, ఎంపీలు, మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్భాటంగానే శంఖుస్థాపన జరిగింది. కొత్తగా ఏర్పాటైన ఈ నూతన భవన ప్రారంభోత్సవం తర్వాత నేరుగా కేసీఆర్ కర్ణాటక వెళ్లనున్నారు. అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. జెడీఎస్ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. మాజీ ప్రధాని దేశ గౌడ కేసీఆర్ తో ఇటీవలె ఫోన్లో మాట్లాడారు. ఎన్నికల ప్రచా రంలో పాల్గొనాలని దేవ గౌడ అభ్యర్థించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గత సంవత్సం డిసెంబర్ 14 తర్వాత ప్రస్తుతం ఆయన ఢిల్లీకి బయలుదేరబోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది.పూర్తిగా జాతీయ రాజకీయాలపైనే ఆయన ఫోకస్ పెడుతున్నారు. టీఆర్ఎస్ కు ఢిల్లీలో స్వంత స్థలం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 2020లో 1100 చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించింది. కేసీఆర్ 2021 సెప్టెంబర్ లో భవన శంఖు స్థాపన చేసి కేవలం 20 నెలల వ్యవధిలో భవన నిర్మాణానికి పూనుకున్నారు. ప్రస్తుతం అదే భవన ప్రారంభోత్సవానికి కేసీఆర్ ఢిల్లీ వెళుతున్నారు.