కేసీఆర్‌ను ఓడించడమే జీవిత లక్ష్యం ..ఈటెల
posted on Jul 30, 2022 @ 4:40PM
కట్టెలు అమ్మిన చోటనే పూలు అమ్మాలని అంటారు. అవమానపడిన చోటనే అధికారం చెలాయిం చాలని అంటారు రాజకీయనాయకులు. తెలంగాణాలో అసలు కేసీఆర్‌కు రాజకీయభవిత లేకుండా చేయడమే తన జీవిత లక్ష్యమని బీజేపీ నేత ఈటెల రాజేందర్ ప్రకటించారు. కేసీఆర్‌ను రాజకీయంగా ఓడించక పోతే తన జన్మకు అర్ధమేలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో బీజేపీ రాకెట్ వేగంతో దూసుకుపోతోందని అన్నారు.
ఈటెల మీడయాతో మాట్లాడుతూ, హుజూరాబాద్, గజ్వేల్ ఎక్కడయినా సరే తాను కేసీఆర్‌ను ఓడించ గల నని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం పట్లా తెలంగాణా ప్రజలు విశ్వాసం కోల్పో యారని ఆయన అన్నారు. తెలంగాణాలో ఎలాగయినా అధికార పీఠం ఎక్కాలన్న ఆతృత బీజేపీ వర్గాల్లో ఉంది.
దీనికి తోడు అంతర్గత సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా తమపార్టీ తప్పకుండా ఘన విజయం సాధిస్తుందన్న ధీమా బీజేపీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. త్వరలో తెలంగాణా 119 నియోజకవర్గాల్లో పర్య టించి పార్టీని పటిష్టంచేస్తానని బీజేపీ నేత ఈటెల అన్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలూ ఉన్నందున డిసెంబరులోపు ప్రతి గ్రామంలోనూ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని యోచిస్తోంది.
కేసీఆర్ వ్యతిరేక ఓటును బీజేపీ వైపు తిప్పుకొనేందుకు కమల దళం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఏపీలో జగన్ నేతృత్వంలోని వైసీపీతో కేంద్రం సత్సంబంధాలు ఏర్పరచుకోవడంపై సీమాంధ్రకు చెందిన అనేక మంది తెలంగాణలో బీజేపీని వ్యతిరేకించవచ్చునని, అలా జరగకుండా చూసుకునేందుకు పలువురు సీమాంధ్ర ప్రముఖులతో సంబంధాలు పెంచుకోవాలని భావిస్తోంది