స్వచ్ఛంద సంస్థలు సాయం చేయాలి .. చంద్రబాబు
posted on Jul 30, 2022 @ 4:10PM
భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలో అపార నష్టం కలిగింది. ఎటు చూసినా నీరే అన్నంతగా పట్టణాలు, పల్లెలు కనిపించాయి. రైతాంగమయితే తీవ్రంగా నష్టపోయింది. ఉభయగోదావరిజిల్లాల్లో గోదావరి ఉదృ తికి పంటనష్టం తీవ్రస్థాయికి చేరింది. ప్రజల ఇన్నాళ్ల కష్టం నీటిపాలయిందని దిగులు పడుతు న్నారు. బాధితులను సమాజం, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నేతలు ఆదుకోవాలని పిలుపుని చ్చారు. ఇప్ప టికే ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచీ సాయం కొనసాగుతోందన్నారు. దాతలు వారి పేరుతో గానీ, తమ సంస్థల నుంచి గానీ సాయం చేయాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
ఈ పరిస్థితుల్లో ప్రజలకు ప్రభుత్వం నుంచి ఆశించినంత భరోసా లభించడం లేదని వాపోతున్నారు. కేవలం ప్రకటనలు, వాకబులతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారు. కాగా విపక్ష నేత చంద్రబాబు స్వయంగా వరద బాధితులను కలిసి వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఇటీవల కురిసిన వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నా రు. మీడియాతో మాట్లాడుతూ , దశాబద్దాల తరబడి సమకూర్చుకున్న సంపదంతా వరదపాలై కట్టుబట్ట లతో ప్రజలు నిస్సహాయ స్థితిలో ఉన్నారని తెలిపారు. నిత్యావసరాలు లేక ప్రజలు దుర్భర స్థితిలో ఉన్నారని అన్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు.