ఢిల్లీ నుంచి గంటల్లో వెనక్కి ఎందుకలా ? ఏం జరిగింది?
posted on May 5, 2023 7:13AM
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుట్ల చంద్రశేఖర రావు చాలా చాలా కాలం తర్వాత ఢిల్లీ వెళ్ళారు. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రే ఆయినా, ఆయనకు రాష్ట్ర రాజదాని హైదరాబాద్ కంటే దేశ రాజధాని ఢిల్లీ అంటేనే కొంచెం ఎక్కువ ఇష్టం. నిజానికి, ఒకానొక సందర్భంలో రాష్ట్ర రాజకీయాలు బోర్ కొడుతున్నాయి, అనే మాట ఆయన నోటి నుంచే వచ్చింది. అయన మనసులోని ఆ ఆలోచనకు కొనసాగింపుగానే కావచ్చును, ఆయన ఒక సుముహుర్తన టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి ( టీఆర్ఎస్) భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా మారి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బీఆర్ఎస్ అధ్యక్షుడిగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెంచారు. అందులో భాగంగానే, దేశ రాజధాని ఢిల్లీలోని, వసంత విహార్‌లో నిర్మించిన బీఆర్ఎస్ కేంద్ర కారాల్యయాన్ని ప్రారంభించారు.
అయితే చిత్రంగా ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి వెళ్ళినంత వేగంగా వెనక్కి తిరిగొచ్చారు. సహజంగా ముఖ్యమత్రి కేసీఆర్ ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా .చెప్పిన రోజుకు తిరిగొచ్చిన సందర్భాలు చాలా చాలా తక్కువ. అలాంటింది, బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభోత్సవానికి ఇలా వెళ్లి అలా రావడం నిజ్జంగా చాలా మందికి చాలా రకాలుగా అర్థమవుతోంది. పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కంటి నొప్పికి, పంటి నొప్పికి ఢిల్లీ వెళ్లి రోజులు, వారాల కొద్దీ అక్కడే ఉండిపోయిన కేసీఆర్, ఏదో మొక్కుబడిగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, అయిష్టంగా ఢిల్లీ వెళ్లి రావడం పజ్లింగ్ గా ఉందని, కొందరు క్వశ్చన్ మార్క్ ఫేస్ పెడుతుంటే, మరి కొందరు.. ఇతకాలం ఢిల్లీ వెళ్ళక పోవడం, ఇప్పడు ఇలా వెళ్లి అలా వెనక్కి రావడం వెనక ఏదో ఉందని అంటున్నారు.
కేసీఆర్ అసలు ఢిల్లీలో ఉండేందుకే ఇష్టపడకపోవడం ఆ పార్టీ నేతల్ని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికి రెండో తేదీనే ఆయన ఢిల్లీ వెళ్లాలని అనుకున్నారు. కానీ ఎందుకనో ఆగిపోయారు. ఢిల్లీలో పలు కీలక సమావేశాలు నిర్వహిస్తారని.. మేధావులతో చర్చలు జరుపుతారని.. పలువురు ప్రాంతీయ పార్టీల నేతలతో .. జాతీయ రాజకీయాలపై చర్చిస్తారని అనుకున్నారు. కానీ, అవేవీ లేవు సరికదా, కనీసం మీడియాను కూడా అడ్రెస్ చేయకుండా మౌనంగా తిరిగొచ్చారు. కేసేఆర్ లో వచ్చిన ఈ మార్పుకు కారణం ఏమిటి? ఇప్పడు ఇదే పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా ట్రెండవుతోంది.
నిజానికి ఢిల్లీ లిక్కర్ స్కాం లో కేసీఆర్ కుమార్తె కవిత పేరు బయటకు వచ్చినప్పటి నుంచి, ముఖ్యమంత్రి ఢిల్లీకి దూరంగా, చాలావరకు మౌనంగా ఉంటున్నారు. జాతీయ రాజకీయ కార్యకలాపాలను కూడా చాలా వరకు మహారాష్త్రకు పరిమితం చేసుకున్నారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారని, జేడీఎస్ తరపున ప్రచారం చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అలాగే, జాతీయ రాజకీయాల్లో ప్రతిపక్షాల ఐక్యత కోసం ఓ వంక నితీష్ కుమార్ మరో వంక మమతా బెనర్జీ, ఇటు నుంచి స్టాలిన్, అటు నుంచి కేజ్రివాల్ ఎవరి ప్రయత్నాలలో వారున్నారు. కానీ, అందులో ఏ ఒక్కరు కేసీఆర్ ను కలవలేదు. కేసీఆర్ వారెవరినీ కలవలేదు. అసలు కేసీఆర్ పేరు జాతీయ రాజకీయాల్లో వినిపించడమే లేదు.
ఇప్పుడు ఢిల్లీ పర్యటన మొక్కుబడి తంతుగా ముగియడంతో, రీల్ వెనక్కి, ఫ్లాష్ బ్యాక్’లోకి తిరగడంతో, తెర వెనక ఏదో జరుగుతోందనే అనుమనాలు మొదలయ్యాయి. ఏదో తెలియని భయం వెంటాడుతోందనే అనుమానాలు వినిపిస్తున్నాయి. అయితే, అసలు ఏమి జరిగింది? ఏమి జరుగుతోంది? అనేది మాత్రం ప్రస్తుతానికి మిస్టరీగా మిగిలింది.కానీ, కేసీఆర్ కు ఎక్కడ హెచ్చలోనే కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలుసు అంటారు .. అందుకే ఇప్పడు తగ్గారు ..కానీ, ఇది వెనకడుగు అనుకోరాదని అనుకోరాదని అంటున్నారు.