కాంగ్రెస్ గూటికి కవిత!
posted on Oct 17, 2022 @ 11:28AM
తెలంగాణా రాజకీయాల పరిణామాలు వేగవంతంగా మారిపోతున్నాయి. టీఆర్ ఎస్ పార్టీ బీఆర్ ఎస్‌గా మారిపోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి దూకి కేంద్రానికి గట్టి సవాలు విసిరి తన ప్రాధా న్యతను దేశమంతా విస్తరించేలా చేయడానికి ముందడుగు వేశారు. అయితే ఈ సమయంలోనే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం బయటపడటం, అందులో కేసీఆర్ కుమార్తె మాజీ ఎంపీ కల్వకుంట కవిత తదితరుల కీలకపాత్ర గురించి వార్తలు దేశమంతటా విస్తరించడం ఎంతో ప్రాధాన్యతను సంతరించు కుంది. ఆమె పాత్ర ఎంతవరకూ ఉంది, అది కేసీఆర్ రాజకీయ భవిష్యత్తు మీద ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నది తెలంగాణా రాజకీయాల్లో తన దైన శైలితో విమర్శనాస్త్రాలు సంధిస్తున్న, కేసీఆర్ సోదరుని కుమార్తె తెలంగాణా ఫైర్‌బ్రాండ్ రమ్యారావు, కవిత కాంగ్రెస్ ఆశ్రయించడానికే ఎంతో అవకాశం ఉందన్నారు. ఆమె కాంగ్రెస్‌తో లోపాయ కారి ఒప్పందాలు చాలాకాలం క్రితమే చేసుకుందని అన్నారు.
శనివారం తెలుగువన్‌తో రమ్యారావు ప్రస్తుత రాజకీయాపరిణామాలగురించి చర్చించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ, అసలు తెలంగాణాలో టీఆర్ ఎస్ రెండోపర్యాయం అధికారంలోకి వచ్చే సమయానికే కవిత బీజేపీ వారితో సంబంధాలు పటిష్టపరుచుకుందని రమ్యారావు అన్నారు. రెండో పర్యాయం టీ ఆర్ ఎస్ రాకున్నా ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకున్నారన్నారు. అం దువల్లనే ఆమె ఎంపీగా గెలిచిన నిజామా బాద్ నుంచే మళ్లీ పోటీచేయడానికి నిర్ణయించుకున్నారు. ఇక్క డ తమ పార్టీ రాకున్నా కేంద్రంలో బీజేపీ పార్టీతో ఉన్న సత్సంబంధాలు కవితకు మద్దతునిస్తాయన్న ధైర్యం ఆమెకు ఎప్పటి నుం చో ఉందన్నారు. అప్పట్లో అమిత్ షా ని మరో కీలక నాయకునితో సంప్ర దించారని, తమ స్థానం సు స్థిరపరచుకోవడానికి సిద్ధపడ్డారని రమ్యారావు స్పష్టం చేశారు.
లిక్కర్ స్కామ్ వ్యవహారం గురించి ప్రస్తావిస్తూ, మరీ విస్తరించేంతవరకూ వాస్తవానికి కేసీఆర్‌కు తెలియ దని, దాని సీరియస్ నెస్ బయటపడడంతో కుమార్తెను ఆ ఉచ్చునుంచి బయటపడేసేటందుకు ఆయన తీవ్ర కృషిచేస్తున్నారని రమ్యారావు అన్నారు. ఢిల్లీలో నాయకులను సంప్రదించి కేసు తీవ్రతను తగ్గించే ప్రయత్నాలు ముమ్మరం చేశారన్నారు. అయితే మునుగోడు ఎన్నికల సమయం ఆసన్న మయిన ఈ సమయంలో కేసు ప్రభావం ఉంటుందని అంటూనే తీవ్రతను తగ్గించడానికే పరువు కాపాడు కునే యత్నా ల్లో భాగంగానే కేసీఆర్ ఢిల్లీ యాత్రలు చేస్తున్నారు. వాస్తవానికి కవిత పాత్ర కీలకమా కాదా అన్నది ఇంకా తేలవలసి ఉందని, అయితే ఈసీ ఏసి బీ దాడులతో ఆమె చుట్టూ కేసు బిగియడం జరుగుతున్నప్పటికీ కవిత సన్నిహితుడు అప్రోవల్‌గా మారితేనే ఆమెకు ప్రమాదం ఉండవచ్చుగాని అప్పటివరకూ ఉండ దన్నారు.
అయితే కవిత నేరుగా ఆర్ ఎస్ ఎస్ ఛీఫ్ మోహన్ భగవత్‌ని సంప్రతించారని, ఆయన ఆమెను స్కామ్ నుంచి రక్షిస్తారన్న నమ్మకంతో ఉందని రమ్యారావు అన్నారు. అంచేత కేసీఆర్ ప్రయత్నాల కంటే మోహ న్ భగవత్ కరుణాకటాక్షాలే ఆమెను కాపాడతాయన్నారు. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో టీఆర్ ఎస్ కేంద్రం మీద భారీ విమర్శలతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో అదెంతవరకూ సాధ్య మన్న ప్రశ్నక సమాధానం చెబుతూ, మునుగోడు ఎన్నికల ముందు పార్టీ ఇబ్బందిపడకుండా బీజేపీ వారు కూడా జాగ్ర త్తలు తీసుకుంటారని, ఆమెపై చర్యకు ఉపక్రమిస్తే మునుగోడులో సెంటిమెంట్ మీద టీఆర్ ఎస్ గెలిచే అవకాశాలుంటాయి గనుక టీఆర్ ఎస్‌పై దాడి అంత వేడిగా ఉండకపోవచ్చన్నారు. పరిస్థితులను అను సరించే అంతా జరిగిపోతుందే తప్ప వెంటనే చర్యలకు దిగితే కేంద్రం కూడా చిక్కుల్లో పడుతుందనే వారు ఆలోచిస్తారన్నారు.
కేటీఆర్, కేసీఆర్ ల మధ్య విభేదాల గురించి వస్తున్న వార్తలను ప్రస్తావిస్తూ, అలాంటిదేమీ లేదని, అసెంబ్లీకి ఎవరు ముందు రావాలి, ఎవరు తర్వాత రావాలన్నదేమీ ఉండదని, పైగా ఒకరు లేని సమయంలో మరొకరు రావడం అనేది ఉండదన్నారు. విభేదాలకు ఆస్కారం లేదని, కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లోకి వెళుతున్నప్పుడు కేటీఆర్‌ను ఇక్కడ ముఖ్యమంత్రి చేసి పార్టీ బాధ్యతను పూర్తిగా ఆయన చేతుల్లో పెట్టే యోచనలో ఉన్నపుడు విబేదాలకు ఆస్కారం ఉండదని రమ్యా రావు అన్నారు. కేంద్రంలో బీజేపీని ఎదు ర్కొనడానికి ప్రతిపక్షాలతో స్నేహసంబంధాలు మరింత మెరుగుపర్చుకుని యుద్ధానికి సన్నధ్దమవుతున్నారనే అనాలి. అలా ఆయన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో కలిసి ఇక్కడ తన కుమారుడు కేటీఆర్ కు ఎలాంటి ఎదురుదాడి లేకుండా చేసుకోవడానికి రేవంత్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ పదవి నుంచి తొలగింప చేయవచ్చు. ఫలితంగా తెలంగాణాలో బీఆర్ ఎస్, కేటీఆర్ ప్రభుత్వానికి అడ్డంకులు ఉండ కుండా పోతా యన్నది ఆయన వ్యూహంలో భాగం కావచ్చునన్నారు.