ద్వేషాన్ని తరిమి కొట్టండి
posted on May 10, 2023 @ 3:04PM
కర్ణాటకలో ఉదయం నుంచి పోలింగ్ జరుగుతుంది. బీజేపీని టార్గెట్ చేసుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కవిత ట్వీట్ చేసింది. ద్వేషాన్ని దేశం నుంచే తరిమి కొట్టాలని, కర్ణాటక ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పిలుపునిస్తున్నారు.
ఇవ్వాళ కర్ణాటక రాష్ట్రంలో పోలింగ్ సందర్బంగా కవిత చేసిన ట్వీట్ ఒక విషయాన్ని స్పష్టం అయ్యింది. బీజేపీని ఓడించండి అని పరోక్షంగా పిలుపునిచ్చారు . మద్యం కుంభకోణంలో తనను బీజేపీ ప్రభుత్వం ఇరికించిందని కవిత ప్రధాన ఆరోపణ. బీజేపీని దేశం నుంచే తరిమికొట్టడానికి కర్ణాటక నాంది కావాలని ఆమె చెప్పకనే చెప్పారు. కర్ణాటక ఫలితాలు 13వ తేదీన ఉన్నాయి. మెజారిటీ సర్వేలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చాయి. రెండో స్థానంలో బీజేపీ కి వచ్చాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా కర్ణాటకలో ప్రచారం చేసింది. జేడీఎస్ తరపున ప్రచారం చేసింది. మాజీ ప్రధాని దేవగౌడ పిలుపు మేరకు కేసీఆర్ అక్కడ ప్రచారం చేయాలని తొలుత నిర్ణయించుకున్నారు. కానీ తెలంగాణా పాలిటిక్స్ హీటెక్కడంతో ఢిల్లీలో బీఆర్ ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభించి నేరుగా హైదరాబాద్ చేరుకున్నారు. ఒక వేళ కేసీఆర్ హైదరాబాద్ రాకపోయి ఉంటే కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉండేవారు. బిజేపీని తరిమికొట్టడమే ప్రధాన లక్ష్యమని ముందు నుంచి కేసీఆర్ చెబుతున్నారు. ప్రధాన ప్రత్యర్థి మీద ఫోకస్ పెట్టదలచుకుని బుధవారం ఆమె చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది.