పశువులా మాట్లాడొద్దు
posted on May 10, 2023 @ 2:25PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వ్యక్తిగత దూషణలు కూడా చేస్తున్నాయి. పశుసంవర్ధక శాఖామంత్రి తలసానిని పశువు అని కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు సంభోధించింది.మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడుతూ.. ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డిలపై తలసాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పశుసంవర్ధక శాఖ అయితే మాత్రం పశువులా మాట్లాడకు తలసాని అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.
తలసాని శ్రీనివాస్ ఏ పార్టీ నుంచి వచ్చారు. టీడీపీలో ఆయన ఏం చేశారో అందరకీ తెలుసన్నారు. రాబోయే రోజుల్లో ఎవరి దమ్ము ఎంతో తెలుస్తుందని చెప్పారు. అందరూ దోచుకోవడంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. శ్రీకాంతాచారి చనిపోవడానికి కారణం తలసాని శ్రీనివాస్ కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం కుర్చీలో ఉన్నారు అంటే అది తమ భిక్ష అని ఆమె చెప్పుకొచ్చారు.
మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సునీతారావు మాట్లాడుతూ.. ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డిలపై తలసాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పశుసంవర్ధక శాఖ అయితే మాత్రం.. పశువులా మాట్లాడకు తలసాని అంటూ ఘాటుగా స్పందించారు.తలసాని శ్రీనివాస్ ఏ పార్టీ నుంచి వచ్చారు.. టీడీపీలో ఆయన ఏం చేశారో అందరకీ తెలుసన్నారు సునీతారావు. రాబోయే రోజుల్లో ఎవరి దమ్ము ఎంతో తెలుస్తుందని చెప్పారు. అందరూ దోచుకోవడంలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. . కేసీఆర్ సీఎం కుర్చీలో ఉన్నారు అంటే అది తమ భిక్ష అని సునీతరావు చెప్పారు.