కాశ్మీర్లో ఇంకా హైటెన్షన్..
posted on Jul 12, 2016 @ 10:51AM
కాశ్మీర్లో ఇంకా ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అక్కడి అల్లర్ల వల్ల మృతుల సంఖ్య 30 కి పెరుగగా.. పలువురికి గాయాలైన సంగతి తెలిసిందే. భద్రతా దళాల సంఖ్య కూడా కేంద్రం పెంచినా.. ఆందోళనకారులు మాత్రం ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా తీవ్రవాదులు హ్యాండ్ గ్రనేడ్ దాడి చేశారు. దీంతో పదిమంది సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ చేసిన నేపథ్యంలో నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ ఆందోళనలో.. మరో ట్విస్ట్ చోటుచేసుకుంది కుల్గాంలోని దమ్హల్ హంజిపోరాలో ముగ్గురు పోలీసుల ఆచూకీ లభించడం లేదు. పోలీస్ స్టేషన్‌పై దాడిచేసిన దుండగులు ఆయుధాలు, పోలీస్ రికార్డులు, వైర్‌లెస్ సెట్లను ఎత్తుకుపోయారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయి.