చంద్రబాబు టూర్ వెనుక మోడీ హస్తం..!
posted on Jul 12, 2016 @ 12:20PM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఆయన కజకిస్థాన్ ను కూడా సందర్సించిన సంగతి విదితమే. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. చంద్రబాబు కజకిస్థాన్ పర్యటన వెనుక ప్రధాని నరేంద్ర మోడీ హస్తం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా వెల్లడించేసరికి అందరూ అవాక్కవుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. చంద్రబాబు కంటే ముందే మోడీ కజకిస్థాన్లో పర్యటించిన సంగతి తెలసిందే. అయితే అక్కడ పర్యటించిన ఆయన కజకిస్థాన్ రాజధానిని చూసి ముగ్ధుడైపోయారట. దీంతో అక్కడ పర్యటించాలని తనకు పదే పదే చెప్పారని చంద్రబాబు వెల్లడించారు.
ఇక ఆస్తానాను చూసిన చంద్రబాబు కూడా.. ఈ రాజధాని తరహాలోనే ఏపీ రాజధాని అమరావతిని నిర్మించాలని అక్కడి అధికారులను కోరారట. అంతేకాదు రష్యా నుంచి విడిపోయిన తరువాత కేవలం పదేళ్లలోనే రాజధానికి అద్భుతంగా నిర్మించుకోగలిగారని.. తనకు ఇక్కడికి వచ్చిన తరువాతే ఆస్తానా రాజధాని ఈ స్థాయిలో ఉందన్న విషయం అర్ధమైందని.. కజకిస్థాన్ అధికారులు అమరావతిలో పర్యటించి కొత్త రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని చంద్రబాబు వారిని కోరినట్టు తెలుస్తోంది. మొత్తానికి మోడీ గారు రాజధానికి నిధులు కేటాయించడంలో ఎలా వ్యవహరించినా.. ఇలాంటి సలహాలు మాత్రం బాగానే ఇస్తున్నారు.