ఆ సైనికుడితో కాశ్మీరీ ఉన్మాదులు ప్రవర్తించిన తీరు చూస్తే… గుండె రగలిపోతుంది!
posted on Apr 12, 2017 @ 7:39PM
కాశ్మీర్ అంటే ఇక్కడ ఎండాకాలంలో చెమటలు కక్కే మనకు చల్లటి హిమలోకం! వీలైతే సమ్మర్ వెకేషన్ కి వెళ్లిరావాల్సిన డెస్టినీ కూడా! కాని, నిజంగా కాశ్మీర్ ఇప్పడు ఎలా వుందో తెలుసా? ఇంటర్నెట్ లో వైరల్ అయిన ఒక వీడియో చూస్తే తెలిసిపోతుంది! అక్కడ జరుగుతున్న వేర్పాటువాద అరాచకం, దాని ఫలితంగా మన భద్రతా దళాలు ఎదుర్కొంటోన్న సమస్యలు అన్నీ కళ్లకు కట్టినట్టు తెలిసిపోతాయి!
కాశ్మీర్ లో గత కొన్ని నెలలుగా వేర్పాటువాదం వేయి పడగలు విప్పి కాటేస్తోంది. అక్కడి తెలివి లేని యువత పాక్ ప్రేరేపిత శక్తులతో కలిసి హింసకు పాల్పడుతోంది. ముఖ్యంగా, రాళ్లు రువ్వటం అక్కడ మామూలైపోయింది. సైనికుల మీద రాళ్లు రువ్వినందుకు పాకిస్తాన్ ఐఎస్ఐ వారికి నెలవారి జీతాలే ఇస్తోందన్నది బహిరంగ రహస్యం! అయినా మన ప్రభుత్వాలు ఏం చేయలేకపోతున్నాయి. రాష్ట్రంలోనూ కేంద్రంలోని బీజేపీ పార్టీనే సర్కార్ లో భాగంగా వున్నా అల్లరి మూకల్ని నియంత్రించే విషయంలో విఫలం అవుతూనే వుంది. ఆ ఎఫెక్ట్ కాశ్మీర్ నేల మీద డ్యూటీ చేస్తోన్న జవాన్లపై తీవ్రంగా పడుతోంది!
మీడియా తాజాగా బయటపెట్టిన ఒక వీడియోలో కాశ్మీర్ అల్లరి మూకలు ఒక సీఆర్పీఎఫ్ జవాన్ను వెంటపడి గేలి చేశాయి. బూతులు తిడితూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు కాశ్మీరీ యువకులు. అయినా కూడా వీడియోలోని యువ జవాన్ సంమయనం పాటించి అన్నీ ఓర్చుకున్నాడు. అందుక్కారణం, చేతిలో అత్యాధునిక గన్ వున్నా ఆ సీఆర్ఫీఎఫ్ జవాన్ల బృందం ఎన్నికల తరువాత ఈవీఎం మెషిన్లు సంరక్షిస్తూ తరలిస్తున్నారు. అటువంటి సమయంలో కాశ్మీర్ ఉన్మాద యువత వాళ్లని టార్గెట్ చేసింది. ముందు నడుస్తున్న ఒక యువ జవాన్ని నోటికొచ్చినట్టు తిట్టిపోసిన యువకులు… అంతలోనే తన్నారు కూడా!
మాటలతో దాడి చేయటం కాకుండా తనపైన భౌతిక దాడికి దిగిన కాశ్మీరీ యువకుడ్ని భారత్ జవాన్ తిట్టిలేదు. బెదిరించలేదు. దాడి చేయలేదు. సహనంతో ఊరుకున్నాడు. తనని కాలెత్తి తన్నినా కూడా మౌనంగా ముందుకు సాగిపోయాడు! ఇలాంటి అవమానాలు మన జవాన్లకు వేర్పాటువాద దెయ్యం పట్టిన కాశ్మీర్లో రోజూ అలవాటే!
సైన్యం ప్రతి చర్యకి పూనుకుని కాల్పులు మొదలు పెడితే రాళ్లు రువ్వే ఉన్మాద యువత అనవసరంగా చచ్చిపోతుంది. అందుకే, చాలా వరకూ భారత జవాన్లు సంయమనం పాటిస్తూ వుంటారు. అయినా కూడా పాక్ పంపే డబ్బుకు అలవాటు పడ్డ కాశ్మీరీ యువకులు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. ఈ మధ్యే ఒక ఉగ్రవాది ఇంట్లో నక్కితే వాడ్ని రక్షించేందుకు ఆర్మీపై రాళ్లు రువ్వారు లోకల్ యువకులు . అప్పుడు కాల్పుల్లో కొందరు చచ్చిపోయారు. ఇలా జరిగితే రాజకీయ పబ్బం కోసం కాశ్మీరీ ప్రతిపక్ష పార్టీలు తీవ్రమైన విమర్శలు, నిరసనలకి దిగుతుంటాయి. మీడియా కూడా తనకు చేతనైనంత ప్రభుత్వ వ్యతిరేక, ఆర్మీ వ్యతిరేక కథనాలు అందిస్తూ వుంటుంది. కాని, ఒక జవాన్ మీద అల్లరి మూకలు దాడి చేస్తే మాత్రం పెద్దగా గొంతులు పెకలకపోవటం విషాదం!
పాక్ పడేసే బిస్కెట్ల కోసం భారత ఆర్మీ మీద మొరిగే కొందరు కాశ్మీరీ యువకులు మళ్లీ తుఫాన్లు, మంచు తుఫాన్లు వస్తే మాత్రం మన సైనికుల సహకారమే తీసుకుంటారు. వార్ని కాపాడి, తిండి, నీళ్లు ఇచ్చేది మన వారే! అయినా ఈ వేర్పాటు వాద జీవుల తోకలు మాత్రం సరిగ్గా అవ్వటం లేదు. ఇక మీదటనైనా ఇలాంటి ఉన్మాదుల్ని భారత ప్రభుత్వం, కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచాలి. ఎందుకంటే, వారికి కావాల్సింది స్వేఛ్చో, స్వాతంత్ర్యమో కాదు. పాక్ పడేసే కరెన్సీ నోట్లు కావాలి. అందుకే, అరాచకం సృష్టిస్తూ వుంటారు. అరాచకుల్ని వారికి అర్థమయ్యే భాషలోనే ఎదుర్కోవాలి.