రెండు వారాలు సంపూర్ణ లాక్ డౌన్
posted on Apr 26, 2021 @ 2:53PM
దేశంలో కరోనా మరణ మదృంగం మోగిస్తుండటంతో ఎక్కడికక్కడ రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నారు. వైరస్ చైన్ బ్రేకే చేసేందుకు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో సంపూర్ణ లాక్ డౌన్ అమలవుతోంది. మొదట వారం రోజులకే లాక్ డౌన్ పెట్టినా.. తర్వాత మరో వారానికి పొడిగించారు. మహారాష్ట్రలో లాక్ డౌన్ అని చెప్పకున్నా... అలాంటి తరహాలోనే కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో నెైట్ కర్ప్యూ ఉంది. వీకెండ్ లాక్ డౌన్ విధించారు. తాజాగా కర్ణాటక ప్రభుత్వం రెండు వారాల పాటు సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఈనెల 27 మంగళవారం నుంచి రెండు వారాలపాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. కర్ణాటకలో ఆదివారం అత్యధికంగా 34 వేల కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో ఇన్ని కేసులు నమోదు కావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ చైన్‌ను తెగ్గొట్టేందుకు ఈ నెల 27వ తేదీ నుంచి 14 రోజులపాటు కఠిన లాక్‌డౌన్ అమలు చేయనున్నట్టు యడియూరప్ప ప్రభుత్వం ప్రకటించింది. మంత్రులు, నిపుణులతో సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు యడియూరప్ప ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి పది గంటల వరకు నిత్యావసర సరుకుల కొనుగోళ్లకు ప్రజలను అనుమతిస్తామన్నారు.