ప్రజలు కరోనాకు భయపడొద్దు.. ఎయిమ్స్ ప్రకటన..
posted on Apr 26, 2021 @ 2:28PM
కోవిడ్19 తేలిక పాటి వ్యాది దీనికి ప్రజలు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా వ్యాఖ్య. ఆల్ ఇండియా ఇన్స్టిట్యుట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కోరోనా వైరస్ చైర్మన్ మేదంతా డాక్టర్ నరేష్ త్రేహాన్ ఎయిమ్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ మెడిసిన్ డాక్టర్ నవీత్ వింగ్ డైరెక్టర్ జనరల్ హెల్త్ సర్వీసెస్ సునీల్ కుమార్ తో కలిసి కొన్ని అంశాలను మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రణదీప్ గులేరియా మాట్లాడుతూ ప్రస్తుతం కోవిడ్19 పై ప్రజలు ప్యానిక్ అవుతున్నారని కోవిడ్19 తేలిక పాటి వ్యాధి మాత్రమే అని అన్నారు.ప్రజలు తీవ్ర భయాందోళన కు గురి అవుతున్నారని భయ బ్రన్తులకు గురి అవుతున్నారని ఈ తేలిక పాటి సమస్యకు రెమిడీ సివిర్ మందు అవసరం లేదని అన్నారు. ఆక్సిజన్ సిలెండర్లను సైతం ఇళ్ళలో నిల్వలు ఉంచారని దీనివల్లే ఆక్సిజన్ కొరత ఏర్పడిందని అనవసరమైన ఆందోళన భయ బ్రాంతులను సృష్టిస్తున్నారని రణ దీప్ గులేరియాఅన్నారు.