Read more!

ప్రజలలో మార్పు కనిపిస్తోంది.. స్వచ్ఛందంగా జగన్ రీ సర్వేరాళ్ల తొలగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే మార్పు వేగం పుంజుకుంది. జగన్ మోహన్ రెడ్డి ల్యాండ్ రీసర్వే పేరుతో చేసిన అరాచకాన్ని రైతులే స్వచ్ఛందంగా సరిదిద్దుతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఫైలుపై చంద్రబాబు సంతకం చేసిన నేపథ్యంలో పొలాల్లో జగన్ రీ సర్వే రాళ్లను రైతులు తొలగించడం ప్రారంభించారు.  

జగన్ రీసర్వే రాళ్లను తీసేసి   గట్లపై పడేస్తున్నారు. అదే సమయంలో పాత సర్వే రాళ్లను మాత్రం ముట్టుకోవడం లేదు.  రైతులకు సంబంధం లేకుండా డిజిటల్‌ సర్వే పేరుతో వైసీపీ ప్రభుత్వం సర్వేచేసి పొలాల్లో రాళ్లను  పాతారు. గతంలో ఉన్న సరిహద్దులను దాటి రాళ్లను వేయడంతో రైతుల మధ్య కొత్త వివాదాలకు తెరలేపినట్టైంది. దీనిపై రైతుల్లో ఎంతో వ్యతిరేకత వెల్లువెత్తింది. అయినా జగన్ అధికారంలో ఉండగా వాటిని అడ్డుకోవడానికి లేదా, ఎదిరించడానికి ఎవరూ ధైర్యం చేయలేకపోయారు.

ఎదిరించినా, నిరసన వ్యక్తం చేసినా వేధింపులు, కేసులు అన్న భయంతో అప్పటికి మిన్నకున్న రైతులు ఇప్పుడు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి, ల్యాండ్ టైటిలిగ్ యాక్ట్ రద్దు ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేయడంతో ధైర్యంగా ముందుకు వస్తున్నారు. స్వచ్ఛందంగా జగన్ రీసర్వే రాళ్లను తొలగిస్తున్నారు.  అస్తవ్యస్తంగా వేసిన రాళ్ళను తొలగిస్తూ పాత హద్దుల పక్కనే ఉన్న రాళ్లను మాత్రం అలాగే ఉంచుతున్నారు.