జర్నలిస్ట్‌లకు భారత్ సేఫ్ కాదు..సర్వేలో బయటపడ్డ నిజాలు..!
posted on May 15, 2016 @ 12:00PM
నిత్యం సమాజం కోసం పరితపించి..నిజాలను నిగ్గుతేల్చే జర్నలిస్టులపై రోజు రోజుకి దాడులు ఎక్కువైపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో పాత్రికేయులపై భౌతిక దాడులకు దిగుతున్నారు. అంతేకాదు చివరికి ప్రాణాలు కూడా తీస్తున్నారు. దీంతో ప్రపంచంలో జర్నలిస్టుల పరిస్థితిపై ఓ అంతర్జాతీయ సంస్థ సర్వే జరిపింది. ఆ సర్వేలో మీడియా వ్యక్తులకు భారత్ అత్యంత ప్రమాదకరదేశమని తేలింది. అంతేకాదు జర్నలిస్టులకు రక్షణ కరువైన దేశాల్లో భారత్ ప్రపంచంలోనే మూడో్ స్థానంలో నిలిచింది. జాబితాలో ఇరాక్, సిరియా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఇద్దరు జర్నలిస్ట్‌లను దుండగులు దారుణంగా కాల్చిచంపడంతో భారత్‌లో జర్నలిస్ట్‌ల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మనదేశంలో 1992 నుంచి ఇప్పటి వరకు 64 మంది పాత్రికేయులు దారుణ హత్యలకు గురయ్యారు.