అది మిస్ ఫైర్ కాదు..ఆత్మహత్య
posted on May 15, 2016 @ 11:29AM
టీఆర్ఎస్ ఎమ్మెల్యే, విప్ నల్లాల ఓదెలు వద్ద ఎస్కార్ట్ విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ బొండాజీ గంగాధర్ తన తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి బెటాలియన్‌కు చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ గత కొంత కాలంగా విప్ నల్లాల ఓదెలు వద్ద విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆది, సోమవారాల్లో మంత్రి హారీశ్‌రావు జిల్లా పర్యటన సందర్భంగా ఏర్పాట్లపై విప్ ఓదెలు మందమర్రిలో పార్టీ కార్యకర్తలతో చర్చిస్తున్నారు. హఠాత్తుగా పెద్దశబ్ధం రావడంతో బయటకు వచ్చి చూడగా గన్‌మెన్ గంగాధర్ రక్తపుమడుగులో పడి ఉండటం చూసి హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ కొద్ది సేపటికే అతను మరణించాడు. తుపాకీ మిస్‌ఫైర్ కావడంతోనే మృతిచెందాడని తొలుత వార్తలు వచ్చాయి. కాని ఆత్మహత్యకు పాల్పడ్డాడని తర్వాత ధ్రువీకరించారు. జిల్లా ఎస్సీ తరుణ్‌జోషి ఆస్పత్రిలో గంగాధర్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయనకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.