Read more!

కాంగ్రెస్ పై జయసుధ రాజీనామాస్త్రం

 

 

 

 

ఎమ్మెల్సీ ఎన్నికలు నగర కాంగ్రెస్ లో సెగలు రేపుతున్నాయి. నగర మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి ఎమ్మెల్సీ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుండగా, కార్తీక రెడ్డికి ఎంఎల్సీ పదవి ఇస్తే తాను రాజీనామా చేస్తానని జయసుధ హెచ్చరించినట్లు తెలుస్తోంది. గతంలో జయసుధ ఎంఎల్ఏగా ఉన్న సికింద్రాబాద్ పరిధిలో ఆమె అనుమతి లేకుండా కార్తీకరెడ్డి భర్త చంద్రారెడ్డి పలు కార్యక్రమాలు చేశారు. దీంతో అప్పటి నుండి జయసుధకు వారికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.

 

కార్తీకరెడ్డి కి ముఖ్యమంత్రి కిరణ్ కు ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడితో భేటీ అయిన జయసుధ తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు తెలుస్తోంది.