Read more!

ఆర్థికాభివృద్ధికి పూలబాట వేశా౦: ప్రధాని మన్మోహన్

 

 

 

 

ఆర్థికాభివృద్ధికి పూలబాట వేశామని, దేశంలో అమలు చేస్తున్న ఆర్థిక సంస్కరణల అమలులో ఎలాంటి మార్పు లేదని ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణలు అలాగే కొనసాగుతాయని ఆయన చెప్పారు. వచ్చే మూడేళ్ళలో 8 శాతం ఆర్థిక వృద్ధి సాధ్యమని ప్రధాని అన్నారు.


రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రసంగానికి రాజ్యసభలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలను ఆయన సమర్థిస్తూ ప్రసంగించారు. యూపీఏ ప్రభుత్వం సంక్షేమ రంగానికి పెద్దపీఠ వేసిందని ఆయన అన్నారు. యూపీఏ హయాంలో దేశం అభివృద్ధి బాట పట్టిందని తెలిపారు. దేశాభివృద్ధికి ప్రభుత్వం చేస్తోన్న సంస్కరణలకు ప్రతిపక్షాలు సహకరించాలని మన్మోహన్ సింగ్ కోరారు.


దేశంలో పేదరికాన్ని నిర్మూలించడం, నిరుద్యోగం లేకుండా చేయడమే యూపీఏ ప్రభుత్వ లక్ష్యమని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. మన దేశానికి 8 నుంచి 9 శాతం అభివృద్ధిరేటు అవసరమని, అది సాధించడమే యుపీఏ లక్ష్యమని ప్రధానమంత్రి తెలిపారు.