Read more!

సైకిళ్లకు బాంబులు పెట్టిన వారిని గుర్తించాం: డీజీపీ

 

 

 

 

దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన జంట పేలుళ్ల ఘటనలో కీలక ఆధారాలు లభ్యమయినట్లు రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి తెలిపారు. ఈ జంట పేలుళ్లకు సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులను గుర్తించారన్నారు. సిసి కెమెరాలలో సైకిళ్లపైన బాంబులు తీసుకువెళుతున్న ముగ్గురు వ్యక్తులను గుర్తించారని, వారిలో ఒకరిని స్పష్టంగా గుర్తించామని, మరో ఇద్దరు అస్పష్టంగా కనిపిస్తున్నారని దినేష్‌రెడ్డి తెలిపారు. సైకిళ్లు అక్కడ పెట్టిన మూడు నిమిషాల్లోనే బాంబులు పేలినట్లు గుర్తించినట్లు డీజీపీ తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో శివరాత్రి వరకు తనిఖీలు చేస్తామని చెప్పారు. ఎన్ఐఏ బృందంతోపాటు రాష్ట్ర పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారని దినేష్‌రెడ్డి పేర్కొన్నారు.