పవర్ స్టార్ పవరేంటో తేల్చేసిన... తిరుపతి సభ!
posted on Aug 27, 2016 @ 3:44PM
పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ అంటారు! అబచ్ఛా... మాకు తెలియదేంటి అంటారా? అఫ్ కోర్స్ అందరికీ తెలుసు! కాని, పవర్ స్టార్ పవర్ ఏంటో ఇవాళ తిరుపతిలో జరగబోయే సభ నిరూపించేసింది! ఎలాగంటారా?
1. వేలాది మంది పాల్గొనే ఒక బహిరంగ సభకి పోలీసులు పర్మీషన్ అంత సామాన్యంగా ఇవ్వరు. కాని, పవర్ స్టార్ తడాఖా తెలుసు కాబట్టి గంటల వ్యవధిలో ఇచ్చేశారు! అయితే, పొంగిన పాల లాగా వచ్చేసే అభిమానుల్ని ఎలా కంట్రోల్ చేస్తారు? అంత మంది పోలీసులు హఠాత్తుగా తిరుపతిలో ఎలా ఊడిపడతారు?
2. తిరుపతిలో పవన్ మీటింగ్ పెట్టిన ప్లేసు... ఇందిరా మైదానం. ఆ గ్రౌండ్ కెపాసిటీ ఎంతా? అంత మంది జనాన్ని అమాంతం అక్కడికి తీసుకొచ్చి నింపడానికి పూనుకున్నదెవరు? అసలు ఎవరైనా సిద్ధపడ్డా జనాన్ని తరలించటానికి ఏర్పాట్లు ఎలా సాధ్యమయ్యాయి?
3. గ్రౌండ్ అంటే వుంటుంది, జనం అంటే జన సేనాని కోసం ఎగబడి వస్తారు. కాని, వందల సంఖ్యలో జెండాలు, వేలాది పోస్టర్లు, ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు... ఇవన్నీ కూడా గంటల వ్యవధిలో ఎలా రెడీ అయిపోయాయి?
4. ఏర్పాట్లు కాదు... ఏర్పాట్లు చేస్తున్న పవన్ కళ్యాణ్ 'శ్రేయోభిలాషులు' ఎవరసలు? వాళ్లు ఇంత కాలం ఏం చేసినట్టు? పవన్ మీటింగ్ అనగానే ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఎలా వాలిపోయార ు?
5. కొండ మీద పంచె కట్టుకుని కూర్చున్న పవన్ కళ్యాణ్ రోజుకోసారి వెంకన్నని దర్శించుకుని గెస్ట్ హోజ్ లోకి వెళ్లిపోతున్నాడు! మరి ఆయన తరుఫున ఇంత పెద్ద సభకి ఏర్పాట్లు చూసుకుంటున్న మొనగాళ్లంతా ఎవరు? వాళ్లు పవర్ స్టార్ ఒక్క మాటతో ఇన్ని లక్షలు ఎందుకు ఖర్చుపెడుతున్నారు? ఏ లాభం లేనిదే రాజకీయాల్లో ఎవ్వరూ పైసా బయటకి తీయరు. మరి ఈ జనసేన మహారాజపోషకులు పవన్ నుంచి ఆశిస్తున్నదేమిటి?
ఈ కొశన్స్ అన్నీ ఎవరో ఒక్కరివి కావు! దాదాపూ ప్రతీ మధ్య తరగతి వాడి మనస్సులో వున్నవే! మామూలు వాడు ఎన్ని సంవత్సరాలు ప్లాన్ చేసినా చిన్న ఇల్లు కట్టలేడు. ఎన్ని నెలలు కుస్తీ పట్టినా ఒక పెళ్లి సజావుగా చేయలేడు. కాని, పవర్ స్టార్ జస్ట్ ఒక్క నిర్ణయంతో కొన్ని గంటల వ్యవధిలో చరిత్రలో నిలిచిపోయే సభకు సిద్ధమయ్యాడు! అందుకే, హీ ఈజ్ ట్రూలీ.... పవర్ స్టార్!