సొంత లాభం కోసం జనం సొమ్ముతో జగన్ యాగం
posted on May 18, 2023 @ 3:46PM
సొంత లాభం కొంత మానుకుని పొరుగువాడికి సాయపడవోయ్ అన్నారు గురజాడ. అయితే మన ఏపీ ముఖ్యమంత్రి మాత్రం సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగినా పట్టించుకోవడం లేదు. సొంత ప్రయోజనాల కోసం అంటూ ప్రజలను నమ్మింది.. ప్రజాధనాన్ని ఇష్టా రాజ్యంగా ఖర్చు చేసేస్తున్నారు. తాజాగా రాష్ట్ర శ్రేయస్సు కోసం అంటూ ఏపీ సీఎం జగన్ చేపట్టిన రాజశ్యామల యాగం కోసం ప్రజాధనం పది కోట్లు ఖర్చు చేశారు. వాస్తవంగా ఈ యాగ నిర్వహణకు మహా అయితే పది లక్షల రూపాయలు ఖర్చవుతుంది. అలాంటిది జగన్ సర్కార్ పది కోట్లు ఖర్చు చేసేసింది. తీరా చూస్తే ఆ యాగం లక్ష్యం ఉద్దేశం అంతా రాష్ట్ర శ్రేయస్సు కాదు. మరేమిటంటారా జగన్ కోసం. తన మీద ఉన్న కోర్టు కేసుల నుంచి బయటపడాలనీ, శత్రు భయం పోవాలనీ, వచ్చే ఎన్నికలలో విజయం సాధించాలనీ..మాత్రమే. యాగ సంకల్పం కూడా అదే. తన మత విశ్వాసానికి యాగాలు చేయడం విరుద్ధం అయినా సొంత లాభం కోసం ప్రజా ధనాన్ని కర్చు పెట్టి మరీ యాగం చేశారు జగన్. ఆ యాగ సంకల్పం ఏమిటో మీరే వినండి..
మమ
సమస్త శతృూణ, ధూర్తహ ఫలాయన సిద్ధి ద్వారా
సర్వత్రా న్యాస్థానేషు
సర్వత్ర వ్యవహారేషు
సర్వత్రా సానుకూల్యత సిద్ధి ద్వారా
సమస్త మంగళ వాక్యర్థం, శ్రీ రాజశ్యామల
మాతంగేశ్వర దేవత అనుగ్రహ సిద్ద్యర్థం
శ్రీ చండీ పరాంబిక సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం
శ్రీ చండీ పరాంబిక పంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం
శ్రీ సుదర్శన సహిత మహాలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్ధం
మదీయ సర్వత్రా పురుషార్దేషు
యేయే ప్రతికూల కారణాహ ద్వేషాం ప్రాతికేల్యత కార
సానుకూలపర్యర్వేనా పరాయంత్ర, పరమంత్ర పరకీయ, సర్వదృష్ట గృహ సర్వా
మమ నిర్యుర్తిపూర్వక స్వకృత్య బలవృద్ధి అర్ధం
చండీ, రుద్రపూర్వక రాజశ్యామల మంత్ర దేవతా
సుదర్శన స్వరూపి సహిత శ్రీ మహా విష్ణు సహిత
శ్రీ మహా లక్ష్మి మహాయాగ అక్ష, కర్మణే, స్వర్ణ
మహాలక్ష్మీ దేవ్యాహ అనుగ్రహ ప్రసాదేనా అవాహనాది షోడచ ఉపచార పూజం కరిష్యే
ఇంత స్పష్టంగా తన కోసం తాను సంకల్పం చెప్పుకుని ప్రజాధనంతో యాగం నిర్వహించి రాష్ట్రం కోసమేనని జగన్ ఎంత పచ్చిగా అబద్ధాలు ఎలా చెప్పగలుగుతున్నారో..