జగన్‌వి అన్నీ డొల్లమాటలే.. కన్నా
posted on Jul 30, 2022 @ 12:30PM
భువినుండీ దివికి దిగిరారా నే పిలిస్తే.. అంటాడు గ్రంథాల్లో ఓ కవి. ఆయన పిలిస్తే నిజంగా వస్తారో రారో గాని ఆ పద్యాలు విని, చదవి పాఠక లోకం బాగా ఆనందించింది. కానీ ఇప్పటి ఈ ఆధునిక కాలంలోనూ తాను కోరింది అమాంతం దేవతలు ఇచ్చేస్తారంటే అదేమన్నా ఎన్టీవోడి సినిమాలో సీనా! కాదుగదా అన్నారు తెలుగు ప్రజలు. ఇక్కడే జగన్ సర్కార్ డొల్లతనం బయటపడిందని విశ్లేషకుల మాట. రాజధాని గురించి జగన్ చెప్పినవన్నీ డొల్లమాటలే నని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.
అధి కారంలోకి వచ్చేముందు చేసిన భారీ పాదయాత్రలో ఆవేశంలో ఎన్నో అన్నారు, మరెన్నో హామీలి చ్చారు. కానీ పీఠం ఎక్కాక కేంద్రంతో చెలిమి మాట అటుంచితే అసలు అమరావతి సంగతి మీద అనేక చర్చలు, ఉపచర్చలకూ ఆయనే వీలు కల్పించారు. మూడు రాజధానులంటూ మరో విపరీత టర్నింగ్ ఇచ్చారు. అందుకే నేల విడిచి సాముచేయరాదని అంటారు పెద్దలు. అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చేశారని బీజేపీ నేత రాష్ట్ర మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. కేవలం కబుర్లతో కాలం వెళ్లబుచ్చుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.
కన్నా లక్ష్మీనారాయణ ఎర్రబాలెం నుంచి ఆరంభమయన మనం.. మన అమరావతి యాత్ర అనే బీజేపీ కార్య్రకమంలో పాల్గొన్నారు. మీడియాతో మాట్లాడుతూ, జగన్ అధికారంకోసం ప్రజల్ని వేడుకుని, అధికా రంలోకి వచ్చిన తర్వాత హామీలన్నీ మర్చిపోయారన్నారు. అమరావతిలో ఏమీ లేదంటూనే జగన్ మూడు రాజధానులనే మాట తెరమీదకు తెచ్చి మోసం చేశారన్నారు. విశాఖలో ప్రైవేట్ ఆస్తులను కబ్జా చేస్తూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా రాజధాని విషయంలో కట్టుబడి రెండేళ్లలో రాజధాని పనులు పూర్తిచేయాలని కన్నా డిమాండ్ చేశారు.