కాంగ్రెస్‌కు ఇక మునుగోడు కష్టం!
posted on Jul 30, 2022 @ 1:57PM
అలిగినవారు కలుస్తారా? అవమానాలు భరించక బయటపడినవారు స్నేహాన్ని ఆశిస్తారా? అవకాశం వెక్కి రిస్తే ఉండగల్గుతారా? మనవాడనుకుంటే అసహాయంగా వదిలేస్తే ఉండాలనుకుంటారా? ఎంతైనా ఒక ఊరోళ్లం అన్నా.. అలకమాని జర ఆలోచించవే.. అంటే భవిష్యత్తు మారిపోతుందా, గత గాయాలు మాను తాయా.. ఎంతైనా మనసు గాయం.. దానికి వేరే సేదతీరే పాటే కావాలి. మునుగోడు ఎమ్మెల్యే రాజ గోపాల్ రెడ్డికి నచ్చిన పాటతో వేరే వారు కూనిరాగం అందుకున్నారు. ఇక ఇంట ఎలా ఉంటారు? అమా యకత్వం కాబోతేనీ? అయినా బతిమిలాడుకుందామన్న కాంగ్రెస్‌వారి చివరి యత్నమూ విఫల మయింది.
మునుగోడు ఎమ్మెల్యే తెలంగాణా కాంగ్రెస్‌లో తనకు సము చిత స్థానం లభిస్తుందన్న ఆశలు ఫలించ లేదు, ఇక పార్టీలో ఉండి ప్రయోజనం లేదన్న అభిప్రాయానికి వచ్చారాయన. అన్నలా కనీసం పార్టీ వారికి స్టార్ క్యాంపెనర్ కూడా కాదు. ఇక గూటిలో ఉండే కంటే రెక్కలల్లార్చి బయటపడటమే మేలను కున్నారు. బీజేపీ వారు ఇలాంటివారికోసమే వేల కళ్లతో ఎదురుచూస్తున్నారు. బీజేపీ వారితో సమావేశ మయ్యారని ఇక అందులో కలవడమే మిగిలిందని రాజ్‌గోపాల్ విషయంలో ప్రచారాలు ముమ్మరం అయ్యాయి. అంతెం దుకు ఆయనే స్వయంగా చూచాయిగా అలాంటి మాటే చెప్పారు.
వాస్తవానికి మునుగోడు ఉన్న నలగొండ జిల్లా కాంగ్రెస్‌కి పెట్టని కోట. కానీ మునుగోడు ఉప ఎన్నికకు వెళితే రాజగోపాల్‌రెడ్డి లేకుంటే కాంగ్రెస్ అవకాశాలు సన్నగిల్లుతాయి. ఎలాగో ఆయన తమ పార్టీనే ఇష్టపడుతు న్నారు గనుక తమ అభ్యర్ధిగా నిలబెట్టి మంచి ఫలితం సాధించాలని బీజేపీవారి ఆలోచన. నల్లగొండ జిల్లా లో కాంగ్రెస్ పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయనే ఆలోచనతోనే మునుగోడు ఎమ్మెల్యే గడ్డం పట్టుకుని బతి మిలాడుకునేందుకు పార్టీ సీనియర్లు సిద్ధపడ్డారు. కాంగ్రెస్‌కు ఇది మైనస్‌గా మారితే ఇటు టిఆర్ ఎస్కు ప్లస్ పాయింటే అవుతుంది. మునుగోడులో ఆయన బీజేపీ అభ్యర్ధిగా ఉన్నప్పటికీ టీఆర్ఎస్ తెలంగాణా వాదంతో బీజేపీ అబ్యర్ధిగా రాజగోపాల్‌ను ఓడించడానికి గట్టి అభ్యర్ధినే పెట్టి గెలవాలన్న వ్యూహం సిద్ధపరచుకునే ఉంటారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వారికి రాజగోపాల్‌తో చివరిగా కలిసి నిర్ణయం మార్చు కునేలా చేయడం అత్యంత అవసరమైంది.
దురదృష్టవశాత్తూ రాజగోపాల్ రెడ్డి తో కాంగ్రెస్ నేతల చర్చలు విఫలమయ్యాయి. ఏఐసీసీ దూతలుగా రాజగోపాల్‌తో కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి భేటీ అయ్యారు. కాం గ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాటగా ఢిల్లీ రావాలని కాంగ్రెస్ నేతలు కోరారు. అయితే ఉత్తమ్ విజ్ఞప్తిని రాజగోపాల్రెడ్డి తోసిపుచ్చారు. గట్టి నిర్ణయం తీసేసుకున్నాక ఇక వెనుదిరిగే ఛాన్స్ ఆయన పార్టీవారికి ఇవ్వలేదు. కాగా, మునుగోడులో ఉపఎన్నిక ఖాయమని... కేసీఆర్ పై ధర్మయుద్ధం చేస్తానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.