జగన్ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట!
posted on Jun 24, 2023 @ 1:45PM
రాజకీయ ప్రయోజనం కోసం ఏపీ సీఎం జగన్ ఎంతకైనా తెగిస్తారనడానికి తాజాగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి అన్న ప్రచారం వెనుక ఆయన ప్రమేయం ఉందని సాగుతున్న ప్రచారమే సాక్ష్యం. వైఎస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం తీసుకోవడం వెనుక జగన్ వ్యూహం ఉన్నదా అన్న చర్చ సాగుతూనే ఉంది. జగన్ తో ఆస్తి తగాదాలు, రాజకీయ వరసత్వ తగాదాలు ఉన్న షర్మిల ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టి అన్నపై సవాల్ చేయకుండా తెలంగాణకు ఎందుకు వచ్చినట్లు?
చెల్లిని తెలంగాణకు సాగనంపిన అన్న అదే దారిలో తల్లిని కూడా ఎందుకు సాగనంపినట్లు? అప్పటి నుండీ మోడీ, షాల ఆశీస్సులతో కోర్టు మెట్లు కూడా ఎక్కకుండా 11 కేసులలో బెయిలుపై రాజకీయాలు నడుపుతున్న జగన్, ఇప్పుడు చెల్లిని కాంగ్రెస్ రాజకీయాలవైపు ఎందుకు పంపిస్తున్నట్లు? జులై8వ తేదీన ఇడుపులపాయ వేదికలో జగన్ కాంగ్రెస్ అధినాయకులకు ఎదురుపడతారా లేదా? ఇడుపులపాయ కార్యక్రమాన్ని షర్మిల ఒక ఉమెన్ షోలా నడిపిస్తారా? అన్న ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరకడం లేదు.
మిత్రుడు కేసీఆర్ కు సహకరించడానికే షర్మిలను తెలంగాణకు పంపారన్న పుకార్లు గతంలో వినిపించినా ప్రస్తుతం బీజేపీ పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో జగన్ కన్ను కాంగ్రెస్ పై పడింది. ఇంత వరకూ రాసుకుపూసుకుని తిరిగిన బీజేపీకి, కేసీఆర్ కి ద్రోహం చేయడానికి ఏమాత్రం వెనకాడని జగన్ తన తోలు కాపాడుకునే పనిలో ఉన్నారు.
షర్మిలకు కర్నాటక నుంచి రాజ్యసభకు పంపి ఇఠు తెలంగాణలో పవర్ సెంటర్ కాకుండా, అటు వైసీపీకి వ్యతిరేకంగా పని చేసే విధంగా షర్మిలను తయారు చేసే పనిలో కాంగ్రెస్ ఉంది. షర్మిల ఎక్కడ ఏమి మాట్లాడినా అందులో కామెడీ తప్ప రాజకీయం ఉండదు కాబట్టి జగన్ లైట్ గా తీసుకుంటున్నాడు.మొత్తం మీద జగన్ అవకాశవాద రాజకీయాలకు షర్మిల, విజయలక్ష్మిలు మరోసారి బలవుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.