Read more!

జగన్ ‘డోర్ డెలివరీ’ అంటుంటే ఫుల్ కామెడీ!

జగన్ పార్టీ ఎమ్మెల్సీ అనంత్‌బాబు తన దగ్గర డ్రైవర్‌గా పనిచేసే డ్రైవర్ని ఎంచక్కా చంపేసుకుని, డెడ్ బాడీని  వెతుక్కోవడానికి పాపం ఆ డ్రైవర్ ఫ్యామిలీ ఎక్కడ ఇబ్బంది పడిపోతారో అని డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ కేసు విషయంలో బుద్ధీ జ్ఞానం వున్నవాడు ఎవరైనా సరే, అనంత్ బాబుని పార్టీ నుంచి డిస్మిస్ చేసేస్తారు. కానీ, మన జగన్నన్న మాత్రం డెడ్ బాడీని డోర్ డెలివరీ చేసిన అనంత్ బాబుని నెత్తిన పెట్టుకుని ఊరేగారు. ఈయనగారు రిమాండ్ పూర్తి చేసుకుని బయటకి వస్తే, వైసీపీ కార్యకర్తల నుంచి ఘన స్వాగతం లభించింది. ఎక్కడ వైసీపీ మీటింగ్ జరిగినా అనంత్ బాబు ఒక ప్రత్యేక అతిథిలాగా తళుక్కున మెరిసి మాయమైపోతూ వుండేవాడు. డెడ్ బాడీ హోమ్ డెలివరీ కేసు మీద మొదట్లో హడావిడి జరిగింది. ఆ తర్వాత ఆ కేసును అటక ఎక్కించేశారు. అనంత్ బాబు మొన్నటి వరకు హాయిగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తూ వుండేవాడు. ఇప్పుడు అధికారం పోయింది కదా.. త్వరలో అనంత్ బాబు డోర్ డెలివరీ మర్డర్ కేసు కూడా లైన్లోకి వచ్చేఅవకాశం వుందిలెండి.

ఇదిలా వుంటే, జగన్ నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్సీల సమావేశంలో ఆయన మాటల్లో ఐదారుసార్లు ‘హోమ్ డెలివరీ చేశాం.. హోం డెలివరీ చేశాం’ అని అన్నారు. జనాలకి డబ్బుని ఇళ్ళకి తీసుకెళ్ళి ఇచ్చాం అనేది జగన్ ఉద్దేశం అయినప్పటికీ, ఆయన ‘హోం డెలివరీ’ అన్నప్పుడల్లా అక్కడున్న అందరికీ డ్రైవర్ డెడ్ బాడీ హోమ్ డెలివరీ చేసిన సంఘటన గుర్తొచ్చి నవ్వు ఆపుకున్నారు. ఆ వీడియో చూసిన వాళ్ళు అయితే హాయిగా పైకే నవ్వుకుంటున్నారు. తాను హోమ్ డెలివరీ అనే మాట అంటే అందరికీ ఆ మర్డర్ కేసే గుర్తొస్తుందని కూడా తెలియని అమాయకుడు మాజీ సీఎం జగన్.