Read more!

ఉయ్యూరులో అన్న క్యాంటిన్.. చంద్రబాబే ప్రారంభించాలి!

ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే ఐదు హామీలపై సంతకాలు చేశారు. తొలి సంతకం మెగా డీఎస్సీపై పెట్టి నిరుద్యోగుల్లో ఆనందాన్ని నింపారు. దీనికితోడు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ రూ.4వేలకు పెంపు, నైపుణ్య గణనపై సంతకాలు చేశారు. ముఖ్యంగా పేదల ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ చంద్రబాబు ఐదవ సంతకం చేశారు. చంద్రబాబు నిర్ణయాలతో ఏపీ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు చిత్రపటాలకు యువత, పేద వర్గాల ప్రజలు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. ముఖ్యంగా అన్న క్యాంటీన్ల పునరుద్దరణ ఫైలుపై చంద్రబాబు సంతకం చేయడం పట్ల పేద వర్గాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు క్తమవుతున్నాయి.

2014 నుంచి 2019 మధ్యకాలంలో టీడీపీ హయాంలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నక్యాంటీన్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఉదయం రూ.5కే టిఫిన్, రూ. 5కే మధ్యాహ్నం భోజనం, రూ. 5కే రాత్రి భోజనం అందించేవారు. పేద ప్రజలు పెద్ద సంఖ్యలో అన్న క్యాంటీన్ల ద్వారా తమ కడుపునింపుకున్న పరిస్థితి. దీనికితోడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పనుల నిమిత్తం, ఉపాధి నిమిత్తం అమరావతి రాజధాని ప్రాంతంకు వచ్చిన వారికి అన్న క్యాంటీన్ల ద్వారా భోజనాన్ని అందించారు. దీంతో పేద వర్గాల ప్రజలు గతంలో టీడీపీ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత నుంచి అన్న క్యాంటీన్లు పూర్తిగా తొలగించి పేదల కడుపుకొట్టాడు.  అన్న క్యాంటీన్లు తొలగించడంతో పేదలు పస్తులుండగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దీంతో పేద ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కొందరు టీడీపీ నాయకులే సొంత ఖర్చులతో అన్న క్యాంటీన్లను నిర్వహిస్తూ వచ్చారు. వారిలో అత్యధికులు నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జీలో, ఎమ్మెల్యే టికెట్  ఆశావహులో ఉన్నారు. కానీ కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దండమూడి చౌదరి  మాత్రం ఎన్టీఆర్ పై అభిమానంతో, భక్తితో, చంద్రబాబుపై నమ్మకంతో, గౌరవంతొ, పార్టీ పట్ల అంకిత భావంతో తన కూడా సొంత ఖర్చులతో, స్థానిక సహకారంతో ఉయ్యూరులో అన్న క్యాంటీన్ నిర్వహించారు. ఈ క్రమంలో వైసీపీ నుంచి ఎన్నో వేధింపులను ఎదుర్కొన్నారు. కేసులు బనాయించినా  దీటుగా దృఢంగా నిలబడ్డారు. 

ఇప్పుడు చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అన్న క్యాంటీన్లను పునరుద్దరిస్తూ సంతకం చేయడం పట్ల దండమూడి చౌదరి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబుకు   కృతజ్ఞతలు తెలుపుతూనే ఒక విజ్ణప్తి కూడా చేశారు.  

అన్న క్యాంటీన్ల పునరుద్దరణనను తాము నిర్వహించిన అన్న క్యాంటీన్ నుంచి సీఎం చంద్రబాబు నాయుడు  ఆరంభించాలన్నదే దండమూడి వినతి. ఈ మేరకు జిల్లా పార్టీ అధ్యక్షుడు కొణతాల నారాయణ, స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్, గతంలో నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించి ప్రస్తుతం న్యూజివీడు నియోజకవర్గం నుంచి విజయం సాధించి మంత్రి అయిన కొలుసు ప్రార్ధసారధి వంటి నేతలు ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి తమ కోరిక తీర్చేలా చూడాలని దండమూడి చౌదరి కోరుతున్నారు. తద్వారా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వైసీపీ దాష్టీకాలను ఎదుర్కొని పోరాడి నిలబడిన తన వంటి కార్యకర్తలకు గుర్తింపు లభించినట్లౌతుందన్నది దండమూడి చౌదరి భావన. ఈ చర్య  తనవంటి వారికి  పార్టీ కోసం మరింత పని చేయడానికి,  పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయడానికి ప్రోత్సాహం ఇచ్చినట్లవుతుందని దండమూడి చౌదరి అంటున్నారు. ఇది డిమాండ్ కాదనీ, విజ్ణప్తి మాత్రమేనని పునరుద్ఘాటించిన దండమూడి కోరికను చంద్రబాబు తీరుస్తారనే అశిద్దాం. కార్యకర్తల కష్టాన్ని ఎప్పుడూ మరచిపోనని పదే పదే చెప్పే చంద్రబాబు దృష్టికి దండమూడి వినతి చేరాలని తెలుగుయువత కోరుతోంది.