నెత్తిన చెయ్యి.. నత్తి పకోడీ..!

నత్తి పకోడీ అని చాలామంది పిలిచే వైఎస్ జగన్ విచిత్రమైన వేషాలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థంకాని పరిస్థితి. అధికారంలో వున్నప్పుడే అంధకారంలో వున్నట్టుగా ప్రవర్తించేవాడు. అధికారం పోయిన తర్వాత మరీ దారుణంగా తయారయ్యాడు. ఎక్కడ ఎలా వుండాలో, ఎక్కడ నవ్వాలో, ఎక్కడ బాధపడాలో కూడా తెలియని వ్యక్తి కాబట్టే, ఆ మహామేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నంత కాలం కొడుకు పేరు చెబితేనే చిరాకు పడేవాడు. ఆంధ్రుల ఖర్మకాలి ఈ దరిద్రాన్ని ఐదేళ్ళపాటు నెత్తిన పెట్టుకోవాల్సి వచ్చింది. ఐదేళ్ళ దరిద్రం వదిలిపోయింది కదా అని ఊపిరిపీల్చుకునే అవకాశం కూడా ఇతగాడు ఆంధ్రులకు ఇవ్వడం లేదు. ఏదో ఒక రచ్చ చేస్తూ తన శాడిజాన్ని ప్రదర్శిస్తూనే వున్నాడు.

మొన్నామధ్య వైజాగ్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగితే రాష్ట్రప్రభుత్వం సహాయ కార్యక్రమాల్లో కావచ్చు.. ఎక్స్.గ్రేషియా విషయంలో కావచ్చు... ఇలా ఏ విషయంలో అయినా ప్రశంసనీయంగా పనిచేసింది. ఆ సమయంలో జగన్ చేసిన పనేంటి? తన విషపు మీడియాలో సాధ్యమైనంత విషం కుమ్మరించడం. ఆ తర్వాత బాధితుల పరామర్శ పేరుతో ఆస్పత్రికి వచ్చి షిక్కటి షిరునవ్వుతో పలకరించడం. దీనికితోడు ఈయనగారి ట్రేడ్ మార్క్ అయిన నెత్తిన చెయ్యిపెట్టి దీవించడం. 

గుడ్లవల్లేరు కాలేజీ హాస్టల్ విషయంలో కూడా జగన్ తీరు ఇదే. అసలు అక్కడ జరిగింది ఒకటి. జగన్ మీడియా విషపు నాగు కక్కిన విషం మరొకటి. ఒకపక్క కాలేజీలోని ఆడపిల్లల్లో భయాందోళనలను తొలగించే ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే, ఈ శాడిస్టు తాలూకు పరమ శాడిస్టు మీడియా కట్టుకథలు అల్లి ప్రచారం చేసింది. ఆడపిల్లలు ఇంకా ఆందోళనకు గురయ్యేలా చేసింది. కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు ఈ సైకో జగన్‌ చేతిలో కాలనాగు లాంటి మీడియా దొరికింది.

ఇప్పుడు విజయవాడ వరదల సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు రాత్రింబవళ్ళు సహాయ కార్యక్రమాలలో నిమగ్నమై వుంటే, జగన్ మీడియా తనదైన శైలిలో విషం కలిపిన కథనాలు వండి వడ్డిస్తోంది. ఇక జగన్ అయ్యగారు వరద ప్రభావిత ప్రాంతాలకు పిక్నిక్‌కి వచ్చినట్టుగా వచ్చాడు. అలా కారులోంచి కిందకి దిగాడు. అక్కడ కష్టాల్లో వున్నవారిని తనదైన ‘షిక్కటి షిరునవ్వు’తో పలకరించాడు. తన చేతికి అందుబాటులో వున్నవారి నెత్తిన చేతులు పెట్టి దీవించి, మళ్ళీ తన కారు ఎక్కి వెళ్ళిపోయాడు. రేపు లండన్ వెళ్తున్నాడు కదా.. దానికి సంబంధించిన సామాను సర్దుకునే బిజీలో వున్నట్టున్నాడు బిడ్డ! 

ఈ వీరుడు ఎక్కడకి వచ్చినా దిక్కుమాలిన నవ్వొకటి నవ్వుతూ జనాన్ని ఇరిటేషన్‌కి గురిచేస్తున్నాడు. ఏ సందర్భంలో ఎలా వుండాలో, ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలియని ఈ నత్తిపకోడీకి నెత్తిన చేతులుపెట్టి ఈ దిక్కుమాలిన దీవించే అలవాటేంటో! ఎక్కడకి వెళ్ళినా నెత్తిన చేతులు పెట్టడం.. దీవించేయడం. ఐదేళ్ళు జనం నెత్తిన చేతులుపెట్టింది సరిపోనట్టుంది.