ఇస్రో చరిత్రలో మరో విజయం.. జీశాట్-18 ఉపగ్రహ ప్రయోగం
posted on Oct 6, 2016 @ 11:22AM
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అంతరిక్ష ప్రయోగాల్లో మరో విజయం సాధించింది. జీశాట్-18 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఇవాళ విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టారు. ఏరియన్‌స్పేస్‌కు చెందిన అతి భారీ రాకెట్ ద్వారా ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ఏరియాన్-5 వీఏ-231 రాకెట్ ద్వారా జీశాట్ 18 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. జీశాట్-18 ఉపగ్రహాన్ని ఇస్రో నిర్మించింది. దీని ద్వారా భారత టెలి కమ్యూనికేషన్ సర్వీసులు మరింత బలపడనున్నాయి. ఇప్పటికే ఇస్రోకు చెందిన 14 టెలికమ్యూనియేషన్ శాటిలైట్లు సర్వీసు అందిస్తున్నాయి. వాటికి తోడుగా ఇప్పుడు జీశాట్-18 కలిసింది. ఏరియన్ 5వీఏ-231 రాకెట్ ద్వారా జీశాట్‌ను ప్రయోగించారు. జీశాట్‌తో పాటు స్కైమస్టర్-2 శాటిలైట్‌ను కూడా ప్రయోగించారు. అది ఆస్ట్రేలియాకు బ్రాండ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ను అందించనుంది. కాగా వాతావరణం సరిగా లేని కారణంగా ఓ 24 గంటలు ఆలస్యంగా ఉపగ్రహాన్ని దక్షిణ అమెరికాలోని ఈశాన్య ప్రాంతం నుంచి ప్రయోగించారు.